గురుకులాల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కు దరఖాస్తులు ఆహ్వానం : అడిషనల్ కలెక్టర్లు

గురుకులాల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కు దరఖాస్తులు ఆహ్వానం : అడిషనల్ కలెక్టర్లు

ఖమ్మం టౌన్,వెలుగు : గురుకులాల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్  దరఖాస్తులు  వచ్చే ఏడాది జనవరి 21 లోగా దరఖాస్తు చేసుకోవాలని అడిషనల్​ కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్లు, గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటనను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ , బీసీ, జనరల్ గురుకుల  బాలికల, బాలుర పాఠశాలల్లో 2026-–27  5వ తరగతి, 6 నుంచి 9వ తరగతులలో (ఇంగ్లీష్ మీడియం) ఖాళీ సీట్లలో ప్రవేవానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. 

వివరాలకు https://tgcet.cgg.gov.in   ను పరిశీలించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఆర్ఓ ఏ. పద్మశ్రీ, జడ్పీ సీఈఓ దీక్ష రైనా, డీఆర్డీఓ  సన్యాసయ్య, సోషల్ వెల్ఫేర్ డీసీఓ జ్యోతి, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ కె. శ్రీనివాస రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.