జనవరి 3న కొండగట్టుకు పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌

జనవరి 3న  కొండగట్టుకు పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌

కొండగట్టు, వెలుగు : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌ కొండగట్టు పర్యటన ఖరారైంది. జనవరి 3న ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌ ద్వారా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి కొండగట్టు సమీపంలోని జేఎన్‌‌‌‌‌‌‌‌టీయూకు వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొండగట్టుకు చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు.

 అనంతరం రూ. 35 కోట్ల టీటీడీ నిధులతో నిర్మిస్తున్న 100 గదుల వసతి గృహాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా కొడిమ్యాల మండలం నాచుపల్లి శివారులోని బృందావనంలో జరిగే ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై, అటు నుంచి జేఎన్‌‌‌‌‌‌‌‌టీయూకు చేరుకొని మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వెళ్లిపోనున్నారు.