రెచ్చగొట్టినప్పుడు ప్రశాంతంగా ఉండండి

రెచ్చగొట్టినప్పుడు ప్రశాంతంగా ఉండండి

రెచ్చగొట్టే, అల్లర్లకుపాల్పడే దుండగులతో కఠినంగా ఉండడాలని… అదే టైమ్‌లో కోపంతో కాకుండా ప్రశాంతంగా వ్యవహరించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఢిల్లీ పోలీసులకు సూచించారు. ఆదివారం జరిగిన ఢిల్లీ పోలీస్‌ 73వ రైజింగ్‌ డే ప్రోగ్రామ్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నో సందర్భాల్లో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరు సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సూచనలను ఎంతగా పాటిస్తున్నది తెలుపుతోందని అమిత్‌ షా అన్నారు.

అమిత్​షా ఇంటికి షాహీన్ బాగ్ నిరసనకారులు

సీఏఏను వాపస్ తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి అమిత్​షా ఇంటి వరకు ర్యాలీ చేపట్టేందుకు వందలాది మంది షాహీన్ బాగ్ మహిళలు ప్రయత్నించారు. అనుమతి లేదన్న కారణంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.