ఫేక్ వెబ్ సైట్లోతో అందినకాడికి దోచేస్తరు

ఫేక్ వెబ్ సైట్లోతో అందినకాడికి దోచేస్తరు

ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారా.. తక్కువ ధరకే వస్తున్నాయని వెబ్ సైట్స్ పై క్లిక్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త... క్షణాల్లో మన బ్యాంక్ ఖాతా ఖాళీ చేయడానికి స్కెచ్ వేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. ప్రస్తుతం అసలు కంటే నకిలీలు ఎక్కువ అయ్యాయి. ఆన్ లైన్ లో షాపింగ్ చేస్తున్నవారినే టార్గెట్ చేసి అందినకాడికి దోచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఫేక్ వెబ్ సైట్లో తక్కువ ధరకే బ్రాడెండ్ వస్తువులంటూ.. యూపిఐ ద్వారా నగదు చేల్లించుకోని మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ క్రిమినల్స్.

హైదరాబాద్.. సైబర్ క్రైం కు కేరాఫ్ గా మారింది. సిటీలో రోజు రోజుకు సైబర్ నేరాలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. పెరిగిన టెక్నాలజీని మిస్ యూజ్ చేస్తూ సరికొత్త దందాలకు ప్లాన్ చేస్తున్నారు కేటుగాళ్లు. ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ లో షాపింగ్ చేస్తున్న వారిని టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఫేస్ బుక్, వాట్సఫ్, ఇన్సస్టాగ్రామ్ లో అసలు పోలిన ఫేక్ వెబ్ సైట్ క్రియేట్ చేసి.. ఫేక్ యాడ్స్ ఇస్తూ తక్కువ ధరకే బ్రాండెడ్ వస్తువులంటూ ప్రచారాలు చేస్తున్నారు.

ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లు, ఉడెన్ ఫర్నిచర్ .. ఇలా అనేక ఉత్పత్తులకు సంబంధించిన యాడ్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అత్యంత ఆకర్షణీయంగా ఉంటున్న ఆ ప్రకటనల్లో ఉత్పత్తుల ఫోటోలు అదే స్థాయిలో ఉంటున్నాయి. ఐతే చాలా మంది  ఏదైనా వస్తువు తక్కువ ధరకు కనిపించగానే ముందు వెనుకా ఆలోచించకుండా కొనేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. వెబ్ సైట్లలో సెర్చ్ చేస్తున్నారు కానీ అది నిజమా కాదా అని తెలుసుకోకుండా డీటెల్స్ ఇస్తున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు వారి డాటా, ఖాతా వివరాలు తెలుసుకోని ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. అందులో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేకపోవడంతో.. యూపిఐ ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ తో క్యాష్ పే చేస్తున్నారు. దీంతో తాము బుక్ చేసిన వస్తువు రాకపోవడంతో మోసపోయమని తెలుసుకొని లబోదిబోమంటున్నారు.

కొద్ది రోజులుగా ఇలాంటి కేసులు అధికంగా నమోదవుతున్నాయి. జూబ్లీహిల్స్ కు చెందిన ఓ వ్యక్తికి ఫేస్ బుక్  పేజీలో  స్పెక్ట్స్ ఆప్టికల్ యాడ్  వచ్చింది. దానిపై ప్రముఖ కంపెనీ పేరు ఉండటంతో పాటు క్లియరెన్స్  సేల్  అని కనిపించింది. మార్కెట్ లో 10 వేలు విలువైన కళ్లద్దాలు 2 వేలకే అంటూ ఉంది. ఆ మొత్తం ఫోన్ పేతో చెల్లించాలని ఉంది. అక్కడ చెప్పినట్టు ఫోన్ పే చేశాడు. తీరా స్పెడ్స్ డెలివరీ కాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించాడు. ఇలాంటి ఆన్ లైన్  ప్రకటనలు చూసి ఎంతోమంది మోసపోతున్నారు. నష్టపోయేది చిన్న మొత్తాలు కావడంతో పోలీసుల దగ్గరికి వెళ్లి కంప్లైంట్స్ కూడా ఇవ్వడం లేదు.

ఐతే ఇలాంటి ఆన్ లైన్ సైట్లతో అలర్ట్ గా ఉండాలంటున్నారు సైబర్ క్రైం పోలీసులు. మామూలుగా ప్రముఖ కంపెనీల నుంచి ఆన్ లైన్ లో ప్రొడక్స్ సేల్ చేస్తే క్యాష్ ఆన్  డెలివరీ ఆప్షన్  ఉంటుంది. బోగస్  వెబ్ సైట్లలో మాత్రం ఈ అవకాశం ఉండదంటున్నారు సైబర్ పోలీసులు. కొందరూ ఫేక్ లింక్స్ పంపించి కస్టమర్ల డాటా చోరీ చేసి డబ్బులు కొట్టేస్తున్నట్లు చెప్తున్నారు సైబర్ క్రైం పోలీసులు. ఏదైనా వస్తువు తక్కువ ధరకు వస్తున్నప్పుడు ఆ వెబ్ సైట్ నకిలీదా, సరైందా చూసుకోవాలని చెప్తున్నారు పోలీసులు. తెలియని వెబ్ సైట్స్ జోలికి వెళ్ళొద్వని హెచ్చరిస్తున్నారు. నకిలీ వెబ్ సైట్లకు దూరంగా ఉండాలంటున్నారు సైబర్ క్రైం పోలీసులు. ఏది పడితే ఆ వెబ్ సైట్లలో షాపింగ్ చేయవద్దని సూచిస్తున్నారు.

సట్టా బెట్టింగ్ రాకెట్ అరెస్ట్

టార్గెట్ 2027: ఎమ్మెల్యేగా గెలుపు.. ఎంపీ పదవికి రాజీనామా

నేను ముత్యాల ముగ్గు హీరోయిన్.. రేవంత్ రెడ్డి విలన్