హంపి, దివ్య రెండో గేమ్ కూడా డ్రా.. టై బ్రేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే తేలనున్న విన్నర్..

హంపి, దివ్య రెండో గేమ్ కూడా డ్రా.. టై బ్రేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే తేలనున్న విన్నర్..

బటుమి( జార్జియా): ఇండియా లెజెండ్ కోనేరు హంపి, యంగ్ సెన్సేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దివ్య దేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ముఖ్ హోరాహోరీగా తలపడుతున్న ఫిడే విమెన్స్ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టై బ్రేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లింది. తెలుగు గ్రాండ్ మాస్టర్ హంపికి 19 ఏండ్ల ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య ఆదివారం జరిగిన రెండో క్లాసికల్ గేమ్ కూడా డ్రా అయింది. చెరో పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నిలిచిన ఈ ఇద్దరూ సోమవారం టై బ్రేక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోటీకి రెడీ అయ్యారు. తొలి గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హంపి, దివ్య ఆటలో  కొన్ని లోపాలు కనిపించినప్పటికీ రెండో గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇద్దరూ  సంప్రదాయ పద్ధతిలో సురక్షితమైన ఎత్తులు వేశారు. 

తెల్లపావులతో తొలి గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలుపు అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయిన దివ్య.. ఈ పోరులో ఎక్కడా తడబడలేదు. తెల్లపావులతో ఆడిన హంపి క్వీన్ పాన్ ఓపెనింగ్‎తో ఆటను ప్రారంభించింది. ఆరంభంలోనే తన రెండు బిషప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (శకటాలు)తో పైచేయి సాధించినట్లు కనిపించినా.. దివ్య తన నైట్స్ (గుర్రాలు)ను వ్యూహాత్మకంగా మారుస్తూ బలమైన డిఫెన్స్ చూపెట్టింది. 

ఆట మధ్యలో  రెండు చిన్న పావులు మారిన తర్వాత ఇరువురూ తమ రూక్స్ (ఏనుగు)ను కూడా వదులుకున్నారు. దీంతో మంత్రి, ఒక చిన్న పావు మాత్రమే మిగిలిన ఆట చివరి దశలో గెలుపుపై ఆశలు దాదాపుగా తగ్గిపోయాయి. దాంతో 34 ఎత్తుల అనంతరం ఇద్దరూ డ్రాకు అంగీకరించారు. కాగా, మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం జరిగిన ప్లే ఆఫ్​ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చైనా ప్లేయర్ టాన్ జోంగ్యి 1.5–0.5 తేడాతో తమ దేశానికే చెందిన లీ టింగ్జీని ఓడించింది. 

టైబ్రేక్ ఇలా

విన్నర్ తేల్చేందుకు నిర్వహించే టై బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలుత 15 నిమిషాల టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రతి ఎత్తుకు10 సెకండ్ల ఇంక్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రెండు ర్యాపిడ్ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడతారు. స్కోర్లు సమానంగా ఉంటే ప్రతి గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 10 నిమిషాలు, 10 సెకండ్ల ఇంక్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మరో సెట్ ఆడతారు. అప్పటికీ ఫలితం తేలకపోతే 5 నిమిషాలు ప్లస్ మూడు సెకండ్ల ఇంక్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మరో రెండు గేమ్స్ నిర్వహిస్తారు. అయినా పాయింట్లు సమంగానే ఉంటే  ఒకరు విజయం సాధించే వరకు 3 నిమిషాలు+ రెండు సెకన్ల ఇంక్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఒక్కో గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడాల్సి ఉంటుంది.