లేక్ ఫ్రంట్ పార్క్ కనువిందు

లేక్ ఫ్రంట్ పార్క్ కనువిందు
  •    జలవిహార్ వద్ద హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో బ్యూటిఫికేషన్ పనులు
  •    తొందరలోనే ప్రారంభిస్తామంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్, వెలుగు : సిటిజన్లు కుటుంబంతో సహా వచ్చి హుస్సేన్ సాగర్ తీరాన్ని చూస్తూ సేద తీరేందుకు మరో పార్కు అందుబాటులోకి రానుంది.  జల విహార్ వద్ద ‘ లేక్ ఫ్రంట్ పార్క్’ ను హెచ్ఎండీఏ అందంగా తీర్చిదిద్దుతోంది.  జల విహార్ పక్కనే 10 ఎకరాల స్థలంలో ఈ పార్కును డెవలప్ చేశారు. ఇందులో ప్రత్యేకంగా నాలుగు ఎలివేటెడ్ వాక్​ వేలను నిర్మించారు. ఈ వాక్​వేపై నుంచి హుస్సేన్​ సాగర్​ పరిసరాల అందాలను చూడొచ్చు.  

పెవిలియన్స్​, పంచతత్వ వాక్​వే, సెంట్రల్​ పాత్​వే, అండర్​ పాసెస్​ వంటివి నిర్మించారు. వాటర్​ బాడీకి 15 మీటర్ల పొడవుతో క్యాంటీలివర్ ఏర్పాటు చేశారు. డెకొరేటివ్​ ఎల్ఈడీ లైటింగ్, హైమాస్ట్​ లైటింగ్​, నవికోమ్​ లైటింగ్​, నియోఫ్లెక్స్​ లైటింగ్​తో పాటు​  సందర్శకులను ఆకట్టుకునేందుకు ఈ పార్కులో ఎన్నో ప్రత్యేకతలున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే, ఈ పార్కుకు సంబంధించిన వీడియోను ఎక్స్(ట్విట్టర్​)లో షేర్​ చేసిన మంత్రి కేటీఆర్..  తొందరలోనే దీన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.