అమ‌లాపాల్కు రెండో పెళ్లి.. క్రేజీగా ప్ర‌పోజ్ చేసిన ప్రియుడు..వీడియో వైర‌ల్‌

అమ‌లాపాల్కు రెండో పెళ్లి.. క్రేజీగా ప్ర‌పోజ్ చేసిన ప్రియుడు..వీడియో వైర‌ల్‌

చెన్నై బ్యూటీ అమలాపాల్(Amala Paul)​ కొత్త జీవితం ప్రారంభించబోతోంది. తన స్నేహితుడిని ఆమె రోండో పెళ్లి చేసుకోనుంది. తన 32వ పుట్టినరోజు సందర్భంగా ఈ గుడ్​న్యూస్​ను వీడియో ద్వారా ఫ్యాన్స్​తో పంచుకుంది. తన ఫ్రెండ్​ జగత్​దేశాయ్( Jagat Desai)​ చేసిన లవ్​ ప్రపోజల్​కు అమల ఎస్​ చెప్పింది. దీంతో త్వరలోనే ఈ జంట పెళ్లికి రెడీ కానుంది. జగత్​ గోవాలో ఓ లగ్జరీ హోటల్​లో మేనేజర్​గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.

జ‌గ‌త్ దేశాయ్‌ కూడా అమ‌లాపాల్ బ‌ర్త్‌డే వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. ఈ వీడియోలో డ్యాన్స‌ర్స్‌తో క‌లిసి స్టెప్పులు వేసిన లవర్ బోయ్ జ‌గ‌త్ దేశాయ్..అమ‌లాపాల్‌ను లోతుగా ఇంప్రెస్ చేశాడు. ఆ త‌ర్వాత అమ‌లాపాల్‌కు రింగ్ ఇచ్చి ప్ర‌పోజ్ చేశాడు. దీంతో..జ‌గ‌త్‌దేశాయ్‌కి అమలాపాల్ లిప్ కిస్ ఇచ్చింది. జగత్ ఈ వీడియోను ఉద్దేశించి నా క్వీన్ ఓకే చెప్పింది. త్వ‌ర‌లోనే పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. హ్యాపీ బ‌ర్త్ డే మై ల‌వ్ అంటూ జ‌గ‌త్ దేశాయ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jagat Desai (@j_desaii)

ఇక బోల్డ్​ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అమలా పాల్​ గతంలో దర్శకుడు విజయ్​ను ప్రేమ పెళ్లి చేసుకుంది. తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. చాలా కాలంగా ఆమె రెండో పెళ్లిపై రూమర్స్​ వచ్చినా అవేవీ నిజం కాలేదు.

ALSO READ :- వీర హనుమాన్ డ్రోన్.. మీ క్రియేటివిటీకి సలాం బాస్..

ఈ తాజా వీడియోపై అమలకు ఫ్యాన్స్​ కంగ్రాట్స్​ చెప్తూ పోస్టులు పెడుతున్నారు. ప్ర‌స్తుతం అమలాపాల్ మ‌ల‌యాళంలో పృథ్వీరాజ్ సుకుమార‌న్‌తో ఆడుజీవితం మూవీ చేస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jagat Desai (@j_desaii)