
హిందూ దేవుడు హనుమంతుని (బజరంగబలి) వేషధారణలో ఉన్న డ్రోన్‌ని చూపించే ఓ వీడియో ఆన్‌లైన్‌లో కనిపించడంతో ఇప్పుడు ఇది అంతటా వైరల్‌గా మారింది. భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్‌లో ప్రజలు డ్రోన్‌ను ఆకాశంలోకి విడుదల చేస్తున్నట్లు ఈ వీడియో చూపిస్తుంది. ఈ క్లిప్‌లో హనుమంతుడు ఆకాశం మీదుగా ఎగురుతూ, పైనుండి తన ప్రజలను ఆశీర్వదిస్తున్న దృశ్యాన్ని చిత్రీకరించారు.
వినల్ గుప్తా అనే ఫొటోగ్రాఫర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫుటేజీని అప్‌లోడ్ చేశారు. ఆయన ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ నుంచి తన క్లిక్‌లను తరచుగా పంచుకుంటూ ఉంటాడు. ఈ అక్టోబర్‌లో జరిగిన దసరా వేడుకల్లో ఈ విజువల్స్ కనిపించాయని పలువురు భావిస్తున్నారు.
ALSO READ :- ENG vs SL: తోక ముడిచిన డిఫెండింగ్ ఛాంపియన్లు.. 156 పరుగులకే ఆలౌట్
మతపరమైన పండుగలను జరుపుకునే సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఇదేం మొదటిసారి కాదు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ గతంలో ఇలాంటి వీడియోలు అనేక పుట్టుకొచ్చాయి. 2015లో డ్రోన్‌ను ప్రయోగించడం ద్వారా ప్రజలు హనుమంతుడిని పూజించడం కనిపించింది.