ENG vs SL: తోక ముడిచిన డిఫెండింగ్ ఛాంపియన్లు.. 156 పరుగులకే ఆలౌట్

ENG vs SL: తోక ముడిచిన డిఫెండింగ్ ఛాంపియన్లు.. 156 పరుగులకే ఆలౌట్

వన్డే ప్రపంచ కప్‌ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కథ ముగిసినట్లే కనిపిస్తోంది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ వారు విపలమయ్యారు. గురువారం చిన్నస్వామి స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌.. 156 పరుగులకే కుప్పకూలింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు ఇంగ్లాండ్ బ్యాటర్లు.. లంక బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయారు. పరుగులు సంగతి పక్కనపెడితే క్రీజులో నిలవడానికే వారు నానా అవస్థలు పడ్డారు. 43 పరుగులు చేసిన బెన్ స్టోక్స్ ఆ జట్టు టాప్ స్కోరర్. జానీ బెయిర్ స్టో(30), డేవిడ్ మలన్(28), జో రూట్(3), జోస్ బట్లర్ (8), లివింగ్‌స్టోన్(1), మొయిన్ అలీ(15) పరుగులు చేశారు. లంక బౌలర్లలో లహిరు కుమార 3 వికెట్లతో చెలరేగగా.. మాథ్యూస్, కసున్ రజిత చెరో 2, తీక్షణ ఒక వికెట్ తీసుకున్నారు.