పంచభూతాలను శాసించే విశ్వంభర.. మెగా156 నుండి క్రేజీ న్యూస్

పంచభూతాలను శాసించే విశ్వంభర.. మెగా156 నుండి క్రేజీ న్యూస్

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా, బింబిసార(Bimbisara) దర్శకుడు వశిష్ట(Vassishta) కాంబోలో ఒక భారీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్(UV Creations) సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా.. ఇటీవల దసరా పండుగా సంధర్బంగా పూజా కార్యక్రమాలతో మొదలైంది. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఏర్పడుతున్నాయి. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ ఐనా క్షణాల్లో ట్రేడింగ్ గా మారుతోంది. 

తాజాగా ఈ మెగా156(Mega156) ప్రాజెక్టు నుండి ఒక క్రీజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేంటంటే.. సోషల్ ఫాంటసీ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమాకు విశ్వంభర(Vishwambhara) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట మేకర్స్. ఈ టైటిల్ అయితేనే సినిమాకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని భావిస్తున్నారట. కారణం విశ్వంభర అంటే పంచభూతాలను తన అదేనంలో పెట్టుకునేవాడు అని అర్థం. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్ లో కూడా పంచభూతాలకు సంబందించిన ఎలిమెంట్స్ ను యాడ్ చేశారు. దీంతో ఈ సినిమాకు పంచభూతాలకు స్ట్రాంగ్ కనెక్షన్ ఉండనుందని అర్థమవుతోంది. అందుకే ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ను ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యారట మేకర్స్. చిరంజీవి లాంటి స్టార్ హీరోకు కూడా ఆ టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అనుకుంటున్నారట. 

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal thakur) హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఛోటా  కే నాయుడు(Chota k naidu) కెమెరామెన్ గా పని చేస్తుండగా.. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి(MM Keeravani) సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. 

ALSO READ :- Good Health : ఈ ఫుడ్ తింటే పొల్యూషన్ నుంచి మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది