పారాసిటమాల్‌తో ఇన్‌ఫెక్షన్ తగ్గదు.. సీసీఎంబీ డైరెక్టర్

పారాసిటమాల్‌తో ఇన్‌ఫెక్షన్ తగ్గదు.. సీసీఎంబీ డైరెక్టర్

ఇంకో రెండు వారాలు పైలం

ఓయూ(హైదరాబాద్), వెలుగు: కరోనా వైరస్​కారణంగా రాబోయే రెండు వారాలపాటు చాలా గడ్డు పరిస్థితులు ఉంటాయని సీసీఎంబీ డైరెక్టర్ ​డాక్టర్ రాకేశ్ మిశ్రా చెప్పారు. ఈ వైరస్ సోకినోళ్లలో ఒక్క శాతం మంది మాత్రమే చనిపోయే అవకాశం ఉంటుందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ వ్యాధి గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిందని, ఇప్పుడు మనుషుల్లోనే ఒకరి నుంచి మరొకరికి సోకుతోందన్నారు. ఎండల తీవ్రతకు వైరస్ వ్యాపించదని అంటున్నారని, అయితే కరోనా వైరస్ వాతావరణాన్ని బట్టి రూపం మార్చుకుంటుందన్నారు. చిన్న పిల్లలు, యువతకు ఈ వ్యాధి పెద్ద సమస్య కాదని, అనారోగ్యంతో ఉన్నవారికి మాత్రం ప్రమాదమన్నారు.  వృద్దులు, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారు ఈ వైరస్​పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. దగ్గు, అస్తమా వంటి సమస్యలున్న వృద్ధులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇలాంటివారు ఇంట్లోనే ఉండిపోవాలన్నారు.

పారాసిటమాల్ తో ఇన్ ఫెక్షన్ తగ్గదు..  

కొవిడ్–19 వ్యాధి లక్షణాలలో జ్వరం కూడా ఒకటని, పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం మాత్రమే తగ్గుతుందని, ఇన్ ఫెక్షన్, ఇతర లక్షణాలు తగ్గిపోవని రాకేశ్ మిశ్రా చెప్పారు. వైరస్​ సోకకుండా జాగ్రత్తలు పాటించడమే మంచిదన్నారు. జనం ఎక్కువుండే మీటింగ్ లు, ఫంక్షన్ల వంటి వాటికి వెళ్లరాదని సూచించారు. ఆరోగ్య సమస్యలు మూడు రోజులకు మించితే డాక్టర్ల వద్దకు పోవాలన్నారు. ఇంట్లో అందరూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని చెప్పారు. బయటికెళితే ఇతరులకు దూరం పాటించాలని, తలుపులు, కిటికీలు, ఐరన్ రెయిలింగ్ లు తాకరాదని సూచించారు. సీనియర్ సిటిజన్లు అయితే ఉదయం ఎండ ఉన్న సమయంలోనే వాకింగ్  చేయాలన్నారు.

For More News..

24 గంటలు.. ఆన్ డ్యూటీ.. రంగంలోకి హెల్త్ సోల్జర్స్

కరోనా వల్ల పరీక్ష వాయిదా

ఒక్కరోజే 8 పాజిటివ్ కేసులు.. మొత్తంగా 13కు చేరిక

కరోనా ఎఫెక్ట్: కరీంనగర్​లో మూడు కిలోమీటర్లు షట్​ డౌన్