
- పర్సవాడలో పెళ్లికాని ప్రసాదులెక్కువే
- మంచిగా చూసుకుంటామన్న ససేమిరా
- తాగేందుకు నీళ్లులేక పోవడమే కారణం
- బురద నీళ్లతోనే గొంతులు తడుపుకుంటున్న జనం
- ఊరవతలి నుంచి మోసుకురావాల్సిం
ఆ ఊరికి పిల్లనియ్యాలంటే జంకుతారు. ఆ ఊళ్లో పెండ్లి కాని మగ పిలగాండ్లు మస్తుమందున్నారు. పిల్లను బాగా చూసుకుంటామని బతిమిలాడినా ఒప్పుకుంటలేరు.అసలేందుకు ఆ ఊరంటే అందరు భయపడుతారో తెల్సా.. అక్కడ తాగేందుకు నీళ్లుండవు. తాగునీళ్లు లేక ఊరు నుంచి జనం వలస వెళ్తున్నారు. ఏండ్ల నుంచి నీళ్లకు తిప్పలుపడుతున్న పర్సవాడ కష్టాల కథ ఇది.
ఆసిఫాబాద్, వెలుగు:కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంపర్సవాడలో నీళ్లకే కాదు అన్నింటి కీ బాధనే.గ్రామంలో డెబ్బై ఆదివాసీ కుటుంబాలుండేవి. నీళ్లులేక చాలా కుటుంబాలు ఊరిడిచిపోయాయి. ఇప్పుడక్కడున్న కుటుంబాలు 35. తాగేందుకు నీళ్లు,చేసేందుకు పనుల్లేక ఈ ఏడాది 15 కుటుంబాలు వలస తొవ్వ తొక్కాయి. నీళ్ల కోసం ఏండ్ల నుంచి అవస్థపడుతున్న జనం అధికారులకు ఎన్ని సార్లు విన్నపాలు చేసుకున్నరో లెక్కలేదు. ఊరి జనానికి చెత్తాచెదారం కలిసిన నీళ్లే దిక్కు. ఊరి పక్కనున్నపాతకాలం నాటి బావిలోంచి గుక్కెడు నీటిని తెచ్చుకుని గొంతులు తడుపుకుంటున్నారు. భూగర్భజలాలు అడుగంటి బురద నీళ్లే మిగిలాయి. ఊరికి ఇంకా రోడ్డు లేదు. రేషన్ కోసం, ఫించన్ల కోసం ఇక్కడి పేదలు సరైన రోడ్డు లేక గుట్టలు, రాళ్ళు దాటుకుంటూ అడవి బాటలో వెళ్లాలి. అనుకోకుండా ఎవరైనా సుస్తయితే 108 అంబులెన్సు కూడా ఊళ్లకు రాదు. రోగమొస్తే, నొప్పులొస్తే దేవుని మీద భారం వేయాల్సిం దే. నాలుగు కిలోమీటర్లు నడచి,కెలిబి చేరుకుంటే అక్కడి నుంచి మండల కేంద్రానికి ఆటోలుంటాయి. జోరువానైనా, నిప్పులు చిమ్మే ఎండైనా కాలినడకన కెలిబికి రావాల్సిం దే.
నీళ్ల కోసమెంత గోస
నీళ్ల కోసం గోస అయితుంది. మా బాధ ఎవరుపట్టించుకుంటలేరు. దునియాల యాడ గీంతపరేషాన్ లేదు. ఊళ్లున్న బాయి ఎండిపోయిం ది.ఊరి చివరున్న బాయిలో కొంచమే నీళ్ళుఉన్నాయి. దిక్కులేక ఆ నీళ్లే తాగుతున్నం. అవితాగితే బీమార్లు వస్తు న్నయి. – దారవత్ .సానుబాయి
ఏం పాపం చేసినం..
మేమేం పాపం చేసినమని మాకిం త కష్టం .అడవిలో పుట్టుడే మా తప్పా.. తిండి లేకున్నామానే , నీళ్లన్నా ఇయ్యం డి సారూ..నీళ్లు లేకచుట్టాలు వస్తలేరు. దూరం పోయిచదువుకుంటున్నా పిల్లలు కూడా ఇంటికిరావాలంటే భయపడ్తు న్నరు.- చవన్ చంచాలబాయి
త్వరలోనే భగీరథ నీళ్లు
పర్సవాడ శివారులోని బావిలో మోటార్ బిగిం చి నీటి సరఫరా చేస్తు న్నం .బావిలో నీరు అడుగంటిపోయిం ది. త్వరలోనే మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తాం .నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. మతీన్ అహ్మద్ ,డిఇ ,ఆర్ డబ్ల్ యూ ఎస్
పిల్లనిస్తలేరు
పర్సవాడకు రోడ్డు , నీళ్ల సౌలత్ లేదని మా ఊరిపోరగాళ్ళకు పిల్ల నిస్తలేరు. చుట్టాలు ఇంటికిరావడం బంద్ చేశారు. ఊరి బయటున్న బాయినీళ్లే తాగుతున్నం . అవి కూడాఅడుక్ కుపోయినయి. ఎమ్మెల్యే, ఎంపీ, లోకల్లీడర్లకు చెప్పినా మా బాధ తీరలే. -జలపత్, ఉప సర్పంచ్, పర్సవాడ