ఎమ్మెల్యే ప్రశాంతి కేసులో విచారణకు రాలేనన్న మాజీ మంత్రి అనిల్ కుమార్...

ఎమ్మెల్యే ప్రశాంతి కేసులో విచారణకు రాలేనన్న మాజీ మంత్రి అనిల్ కుమార్...

నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలున్న క్రమంలో వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు జులై 23న నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఎమ్మెల్యే ప్రశాంతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనిల్ కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. శనివారం ( జులై 26 ) విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు కోవూరు పోలీసులు. ఈ నోటిసులపై స్పందించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ విచారణకు హాజరు కాలేనని లాయర్ల ద్వారా పోలీసులకు సమాచారం అందించారు.

వ్యక్తిగత కారణాలతో పాటు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన క్రమంలో విచారణకు హాజరు కాలేనని తెలిపారు అనిల్ కుమార్. విచారణను తప్పించుకునే ఉద్దేశం తనకు లేదని.. లాయర్ల ద్వారా పోలీసులకు సమాచారం అందించానని తెలిపారు అనిల్ కుమార్. త్వరలోనే విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు అనిల్ కుమార్. ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన ఈ కేసుకు సంబంధించి విచారణకు  అనిల్ కుమార్ గైర్హాజరవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ పై కేసు నమోదైన సంహతి తెలిసిందే. ఈ కేసులో ప్రసన్నకుమార్ ను నిందితుడిగా చేర్చిన పోలీసులు, మాజీ మంత్రి అనిల్ కుమార్ కు కూడా నోటీసులు జారీ చేశారు. ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ ప్రసన్నకుమార్ ఇంటిపై దాడి చేశారు ఆమె అనుచరులు. ప్రసన్నకుమార్ ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు.