కంబోడియా-థాయిలాండ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి.. భారత్ సలహా

కంబోడియా-థాయిలాండ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి.. భారత్ సలహా

 థాయిలాండ్‌ కంబోడియా మధ్య యుద్ధం ముదురుతుండటం ఈ రెండు దేశాల సరిహద్దు ప్రాంతాలకు ప్రయాణించొద్దని భారత పౌరులను కోరుతూ కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం సలహా జారీ చేసింది. గత కొన్ని ఏళ్లుగా  కొనసాగుతున్న ఈ ఘర్షణలు ప్రస్తుతం యుద్ధంగా మారే ప్రమాదం ఉందని, అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న భారత పౌరులు రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరింది.

వెళ్లకూడని ప్రాంతాలు:  థాయిలాండ్‌లోని భారత రాయబార కార్యాలయం ఉబోన్ రాట్చథాని, సురిన్, సిసాకెట్, బురిరామ్, సా కేయో, చంతబురి, ట్రాట్‌తో సహా  ప్రావిన్సులలోని 20కి పైగా ప్రదేశాలకు వెళ్లోద్దని సూచించింది.

లక్షకు పైగా నిరాశ్రయులు : ఇరు దేశాల మధ్య పోరాటం శనివారం వరుసగా మూడో రోజుకు చేరుకోగా, రెండు వైపులా దౌత్యపరమైన మద్దతు కోరుతూ శత్రుత్వం వదిలి చర్చలు ప్రారంభించాలని కోరాయి. 13 సంవత్సరాలలో రెండు దేశాల మధ్య జరుగుతున్న అత్యంత తీవ్రమైన పోరాటంలో కనీసం 30 మంది మరణించగ, 130,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

కొత్త ప్రాంతాలకు సరిహద్దు వివాదం: థాయ్‌లాండ్ నావికాదళం శనివారం ఉదయం ట్రాట్ అనే తీర ప్రాంత జిల్లాలో  కాల్పులు జరిగినట్లు చెప్పింది. ఈ ప్రాంతం సరిహద్దులోని ఘర్షణ ప్రాంతాలకు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంది. దింతో యుద్ధం కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందని తెలుస్తుంది.

►ALSO READ | ఇండియా, పాకిస్తాన్ మాదిరిగానే.. థాయ్ లాండ్, కాంబోడియా గొడవలు : ఇప్పుడు యుద్ధం వరకు ఎందుకెళ్లాయి..?

ఉద్రిక్తతలు ఎందుకు పెరిగాయంటే : గత నెల మేలో కంబోడియా సైనికుడిని కాల్చి చంపినప్పటి నుండి ఈ ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. అప్పటి నుండి రెండు వైపులా భీకర కాల్పులు చేసుకోవడంతో థాయిలాండ్‌ ప్రభుత్వం పతనానికి ఈ యుద్ధం ఆజ్యం పోసినట్లయింది. శనివారం నాటికి థాయిలాండ్ మరణాల సంఖ్య 19 చేరుకోగా, కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి 13 మంది మరణించారని వెల్లడించింది.

ఆ ప్రాంతం కోసమే యుద్ధం : థాయ్‌లాండ్‌లోని సురిన్ ప్రావిన్స్, కంబోడియాలోని ఒడ్డార్ మీంచే ప్రావిన్స్ సరిహద్దుల్లో ఉన్న ఎమరాల్డ్ ట్రయాంగిల్ ప్రాంతం విషయంలో ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. ఈ ప్రాంతం లావోస్‌తో పాటు థాయ్‌లాండ్, కంబోడియా సరిహద్దులను కలుపుతుంది. ముఖ్యంగా, ఈ ప్రాంతం ప్రాచీన దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. సుమారు 15 ఏళ్ల క్రితం కూడా ఈ ప్రాంతం కోసమే ఇరు దేశాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే థాయ్‌లాండ్ కంబోడియా 800 కిలోమీటర్లకు పైగా సరిహద్దు ఉంది.