ఇండియా, పాకిస్తాన్ మాదిరిగానే.. థాయ్ లాండ్, కాంబోడియా గొడవలు : ఇప్పుడు యుద్ధం వరకు ఎందుకెళ్లాయి..?

ఇండియా, పాకిస్తాన్ మాదిరిగానే.. థాయ్ లాండ్, కాంబోడియా గొడవలు : ఇప్పుడు యుద్ధం వరకు ఎందుకెళ్లాయి..?

కంబోడియా, థాయిలాండ్ మధ్య సరిహద్దు వివాదం మూడో రోజుకు చేరుకోగా, థాయిలాండ్‌లో 19 మంది, కంబోడియాలో 13 మందితో   మొత్తం 32 మంది చనిపోయారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ గొడవల కారణంగా వేలాది మంది  నిరాశ్రయులయ్యారు. అయితే థాయిలాండ్‌తో వెంటనే కాల్పుల విరమణ కోరుకుంతున్నట్లు కంబోడియా దేశ రాయబారి ఐక్యరాజ్యసమితికి తెలిపారు.

నిన్న శుక్రవారం రాత్రి న్యూయార్క్‌లో జరిగిన అత్యవసర సమావేశం తర్వాత కంబోడియా UN రాయబారి ఈ విషయాన్ని వెల్లడించారు. UNలో థాయిలాండ్ రాయబారి చెర్డ్‌చాయ్ చైవైవిద్ కూడా కంబోడియా అన్ని శత్రుత్వాలు, దురాక్రమణ చర్యలను వెంటనే ఆపేసి చర్చలకి రావాలని కోరారు.
 
 ఈ రెండు దేశాల మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం గురువారం తీవ్ర ఘర్షణకు దారితీసింది. దింతో భారీ ఫిరంగి దాడులు,  వైమానిక దాడులు జరిగాయి. మలేషియా, అమెరికా, చైనా కూడా ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశాయి.

శనివారం ఉదయం థాయిలాండ్ మా సరిహద్దుకు దక్షిణం వైపున కొన్ని ప్రదేశాలపై భారీ ఫిరంగులు పేల్చిందని కంబోడియా ఆరోపించగా, ట్రాట్ ప్రావిన్స్‌లో కంబోడియానే  మొదట దాడి చేసిందని థాయిలాండ్ తెలిపింది. సరిహద్దు ప్రాంతాల నుండి థాయిలాండ్ 138,000 మందికి పైగా ప్రజలను సురక్షిత తరలించగా, కంబోడియా 23,000 మందికి పైగా ప్రజలను తరలించింది.


 కంబోడియా థాయిలాండ్ సరిహద్దు వివాదం:  కంబోడియా థాయిలాండ్ సరిహద్దు వివాదం ఒక శతాబ్దం కంటే ఎక్కువ కాలం నాటిదే. గత మే నెలలో జరిగిన కాల్పుల్లో ఒక కంబోడియా సైనికుడు మరణించినప్పటి నుండి ఈ ఉద్రిక్తతలు ఎక్కువైయ్యాయి. కానీ ఈ వారంలో థాయ్ సైనికులు కంబోడియా ల్యాండ్‌మైన్‌ల వల్ల గాయపడటంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే ఈ ఆరోపణలను కంబోడియా కొట్టిపారేసింది.

►ALSO READ | ఏడాది వాన ఒక్కనాడే కురిసింది ..ఉత్తర చైనాలో కుండపోత

గతంలో కూడా కాల్పులు : థాయిలాండ్ కంబోడియా మధ్య మొదట కాల్పులు మీరంటే మీరే చేసారని ఇరు దేశాలు ఒకరినొకరు నిందించుకున్నాయి. మరొక వైపు అంతర్జాతీయ నిబంధనలను కూడా ఉల్లంఘించిందని ఆరోపించుకున్నాయి. దీనికి ముందు థాయ్ ప్రధాన మంత్రి ఫుమ్తామ్ వెచాయాచాయ్ పరిస్థితి తీవ్రమైతే యుద్ధంగా మారవచ్చు అని హెచ్చరించారు. గతంలో 2008 నుండి 2011 మధ్య కూడా  ఇలాంటి ఘర్షణలు జరిగాయి, అప్పట్లో సుమారు 28 మంది మరణించగా, వేల మంది నిరాశ్రయులయ్యారు.

తండ్రుల మధ్య చెలరేగిన గొడవలు : థాయిలాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ చర్చలకు సిద్ధంగా ఉందని  ప్రకటించాక కూడా కంబోడియా నుండి ఇంకా ఎటువంటి స్పందన రాలేదని పేర్కొంది. రెండు దేశాల ప్రధానమంత్రుల తండ్రుల మధ్య చెలరేగిన వ్యక్తిగత గొడవలే  ప్రస్తుత వివాదానికి కారణమని కొన్ని తెలుస్తుంది. అయితే థాక్సిన్ షినవత్రా ఈ ఆరోపణలను ఖండించారు, ఘర్షణలకు కారణం కుటుంబ కలహాలు కాదని స్పష్టం చేశారు.