బీర్ల కంపెనీలు ఓపెన్..సర్కార్ పర్మిషన్ తో ప్రొడక్షన్ స్టార్ట్

బీర్ల కంపెనీలు ఓపెన్..సర్కార్ పర్మిషన్ తో  ప్రొడక్షన్ స్టార్ట్

సంగారెడ్డి, వెలుగులాక్ డౌన్ తో మూతబడిన బీర్ల కంపెనీలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఎక్సైజ్​శాఖ ప్రొడక్షన్​కు పర్మిషన్ ఇవ్వడంతో సంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ ఫ్యాక్టరీలు ఓపెన్ అయ్యాయి. రాష్ట్రమంతటికీ, వివిధ రాష్ట్రాలకూ ఈ ఫ్యాక్టరీల నుంచే  బీర్ల సరఫరా జరుగుతుంది. ఎండాకాలంలో నిరంతరాయంగా పనిచేసే బీర్ల కంపెనీలు కరోనా కారణంగా మూతపడ్డాయి. తాజాగా ఎక్సైజ్ ఆఫీసర్ల ఆదేశాలతో కొండాపూర్ మండలం మల్లేపల్లి పంచాయతీ పరిధిలోని నాలుగు, సంగారెడ్డి మండలం ఫసల్ వాది, కొత్లాపూర్​లోని బీర్ల ఫ్యాక్టరీలు తెరుచుకున్నాయి. కొండాపూర్ లోని ప్రముఖ యూబీ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఇక్కడ ఉదయం 7 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఒకే షిఫ్ట్ కింద సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ బీర్లు ఉత్పత్తి చేస్తున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.

తెరువకపోతే నష్టాలే…

లాక్​డౌన్​కారణంగా ఫ్యాక్టరీలతో పాటు ఎక్సైజ్ డిపోలు, వైన్ షాపులలో సుమారు 20లక్షల కాటన్ల బీర్లు… అంటే కోటిన్నర లీటర్ల బీరు నిల్వలు ఉన్నట్లు ఎక్సైజ్ ఆఫీసర్లు చెబుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ లో రాష్ట్రవ్యాప్తంగా సరాసరి 50లక్షల కాటన్ల వరకు బీర్లు అమ్ముడు పోయేవి. ఈసారి లాక్ డౌన్ ఆ ఒక్క నెలలోనే రూ.600 కోట్ల వరకు నష్టం వచ్చిందని తయారీదారులు వాపోతున్నారు. మేలోనూ అంతే స్థాయిలో విక్రయాలు ఉంటాయని, ఒకవేళ వైన్స్ కు మినహాయింపు ఇవ్వకపోతే నష్టం రెట్టింపు అవుతుందని ఆందోళన చెందుతున్నారు. బీర్ల వినియోగంలో అర్బన్​ ఏరియాలదే ప్రధాన వాటా. నగరాలు, పట్టణాల్లోనే 90శాతం బీర్లు అమ్ముడుపోతాయి. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్​పరంగా చూస్తే రూరల్​ ఏరియాలు సేఫ్​జోన్​లో ఉన్నాయి. రెడ్​ జోన్లన్నీ దాదాపుగా సిటీలు, టౌన్స్​లోనే ఉన్నాయి. ఇక బీర్లు అత్యధికంగా అమ్ముడుపోయే హైదరాబాద్​ రెడ్​జోన్​లోనే ఉంది. ఒకవేళ గ్రీన్ జోన్​లలో వైన్స్​లు తెరిచి, రెడ్​జోన్స్​లో కొంతకాలం తెరువకపోయినా నష్టమేనని తయారీదారులు అంటున్నారు. ఈలోగా నిల్వ ఉన్న కోటిన్నర లీటర్ల బీరు వాలిడిటీ అయిపోతుందని, అలా జరిగితే దాన్ని డ్రైనేజీల్లో పారబోయల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడా వైన్స్‌‌కు పర్మిషన్?

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. పొరుగున ఉన్న ఏపీలోనూ సోమవారం నుంచి షాపులు ఓపెన్​ చేశారు. తెలంగాణలో ఎప్పుడు ఓపెన్​ చేస్తారోనని మద్యం ప్రియులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం కేబినెట్​ మీటింగ్ అనంతరం సీఎం కేసీఆర్​దీనిపై ఓ ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. బుధవారం నుంచి వైన్స్ తెరుచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. తాజాగా బీర్ల ఉత్పత్తికి ఎక్సైజ్ శాఖ అనుమతివ్వడమే