Sankranti 2026: సంక్రాంతి పండుగ రోజు.. ఏం చేయాలి.. ఏం చేయకూడదు..!

Sankranti 2026:  సంక్రాంతి పండుగ రోజు.. ఏం చేయాలి.. ఏం చేయకూడదు..!

పట్నం ప్రజలు పల్లెబాట పట్టారు.  బళ్లకు ఓ వారం రోజుల పాటు తాళాలేశారు.  పిల్లలు అమ్మతో  కలిసి అమ్మమ్మ.. నాయినమ్మ ఊళ్లకు వెళుతున్నారు.  ఇప్పుడిదంతా ఎందుకనుకుంటారా.. అదేనండి సంక్రాంతి సందడి మొదలైంది.  తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకొనే పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండుగ హిందువులకు చాలా ముఖ్యమైనది. ప్రపంచ వ్యాప్తంగా జరుపుకొనే సంక్రాంతి   పండుగ రోజు తప్పనిసరిగా చేయవలసిన పనులు, చేయకూడని పనులేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

సంక్రాంతి పండుగ రోజు సూర్యుడు మకరరాశిలోకి  మారబోతున్నాడు.  గ్రహాల రాజు సూర్యునికి ఆరోజు అంతా పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు. పుణ్య నదుల్లో స్నానం చేసి...సూర్యభగవానుడికి నమస్కారం చేయాలి.  పంటలు పండాలన్నా.. భూమి మీద ఏ ప్రాణి జీవించాలన్న నీరు తప్పనిసరి.  అందుకే  మకర సంక్రాంతి రోజున సూర్యుడికి నదికి కృతఙ్ఞతాభావంగా పూజలు చేయాలి. 

మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన రోజున  మకర సంక్రాంతి పండుగను  జరుపుకుంటారు. ప్రతి ఏటా వచ్చినట్లుగానే ఈ ఏడాది(2026)  కూడా జనవరి నెలలోనే వచ్చింది ఈ గాలిపటాల పండుగ. సకల జీవరాశులకు ప్రత్యక్ష దర్శనమిచ్చే సూర్య భగవానుడు ఈ నెల 14 న మధ్యాహ్నం 3.43 గంటలకు మకర రాశిలోని ప్రవేశించబోతున్నాడు. ఆ నేపథ్యంలోనే భారత్‌లో జనవరి 15న మకర సంక్రాంతిని జరుపుకోనున్నాం.

మకర సంక్రాంతి రోజున తప్పక చేయవలసినవి

 

  • మకర సంక్రాంతి రోజున ఇతర వ్యక్తులతో చెడుగా ప్రవర్తించడం ... ఇతరులతో  అనుచితంగా ప్రవర్తించడం మానుకోవాలి.
  • సంక్రాంతి  పండుగ రోజున సూర్య భగవానుని పూజించాలి.  గంగా నదిలో స్నానం చేసి దోసిళ్లతో నీటిని సూర్య భగవానుడికి సమర్పించాలి. 
  • గంగా నది అందుబాటులో లేకపోతే.. దగ్గరలోని నది కాని.. లేదా ఇంట్లో ఉండే మోటారు దగ్గర స్నానం చేయాలి.
  • ఒకవేళ మీరు గంగా నదిలో కాకుండా మరేదైనా నదిలో స్నానం చేస్తుంటే..ఆ నది ఆశీర్వాదం కోసం ప్రార్థించండి. 
  • కుల దేవతలకు పూజ చేసి వారి ఆశీర్వాదం కోసం ప్రార్థించాలి
  • మకరసంక్రాంతి రోజున శివుడు, విష్ణువు, లక్ష్మీ దేవిని కూడా పూజించాలి.
  •  దేవతలకు నువ్వులు, బెల్లం, పెరుగు, తాజా బియ్యంతో ( కొత్త బియ్యం)  చేసిన పాయసం చేసి దేవుడికి నివేదించి.. ప్రసాదంగా తీసుకోవాలి. 
  • మకర సంక్రాంతి రోజున కొత్త చీపురును కొని ఇంటికి తెచ్చుకోండి. అలా చేస్తే లక్ష్మీదేవిని ఆహ్వానించినేట్లనని పండితులు చెబుతున్నారు. 
  • నువ్వులు, బెల్లం లడ్డూలను తయారు చేయడం, దేవతలకు సమర్పించడం ఈ పండుగ సందర్భంగా పాటించే ముఖ్యమైన ఆచారాలలో ఒకటి.
  • పెద్దలు, పూర్వీకుల నుంచి ఆశీర్వాదం పొందండి. పూర్వీకులకు ఈ రోజున నమస్కరించాలి.  అలాగే బ్రాహ్మణులకు స్వయం పాకం.. బట్టలు.. దక్షిణ తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోంది.  పితృదోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. 
  • పేదలకు  అవసరమైన వస్తువులను..ధన సహాయం చేయండి.
  • దగ్గరలోని దేవాలయాలను సందర్శించి.. పూజారి ఆశీర్వాదం తీసుకోండి.
  • వ్యవసాయ భూములను ఉత్పాదకంసాగు భూమిగా  ఉంచడంలో సహాయపడినందుకు నదులు, నీటి వనరులు, సూర్యుడు,  ప్రకృతి  పట్ల కృతజ్ఞతలు తెలిపేందుకు పూజలు చేయాలి. 

మకర సంక్రాంతి రోజున చేయకూడనివి

  • మకర సంక్రాంతి రోజున పవిత్ర నదులలో స్నానం చేస్తారని నమ్ముతారు. ఈ రోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవాలి. సాయంత్రం, రాత్రి వేళల్లో తినకూడదు
  • చెట్లు, మొక్కలను నరకకూడదు.  ఎందుకంటే  మకర సంక్రాంతి పండుగ ముఖ్య ఉద్దేశం ప్రకృతిని ప్రార్థించి, గౌరవించడం.. 
  • మాంసాహారం, మద్యం, పొగాకు, గుట్కా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.
  • వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి ఆహారాలు  తినకూడదు.
  • ఈ రోజున ఎవరైనా సన్యాసి మీ ఇంటికి వస్తే, అతన్ని ఖాళీ చేతులతో వెళ్లనివ్వవద్దు. వారికి ఏదో ఒకటి దానం చేస్తే మీకు మంచి జరుగుతుంది
  • సంక్రాంతి పండుగ రోజున ఇతరులతో చెడుగా, అనుచితంగా ప్రవర్తించకూడదు.

నదీ జలాల్లో పవిత్ర స్నానం చేయడం, సూర్య భగవానుడు, శని దేవతలకు నైవేద్యాలు సమర్పించడం, గాలిపటాలు ఎగురవేయడం ఈ వేడుకను జరుపుకునే విలక్షణమైన మార్గాలు. ఈ సందర్భంగా మీరు తప్పనిసరిగా చేయవలసిన అనేక అంశాలు ఉన్నాయి. అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఇతరులను బాధపెట్టే లేదా ప్రకృతికి హాని కలిగించే పనులు చేయకూడదు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.