ఎలక్షన్స్, ఐపీఎల్ ఎఫెక్ట్: రాష్ట్రంలో భారీగా బీర్ల డిమాండ్..

ఎలక్షన్స్, ఐపీఎల్ ఎఫెక్ట్: రాష్ట్రంలో భారీగా బీర్ల డిమాండ్..

రాష్ట్రంలో బీరు జోరు కొనసాగుతోంది. రోజురోజుకు బీర్లకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. బీర్ల అమ్మకాల్లో…పాత రికార్డులు కూల్ గా కరిగిపోతున్నాయి. ఎండలకు పోటీగా… బీర్ల సేల్స్ జరుగుతున్నాయి. సమ్మర్ తో పాటు ఐపీఎల్, పార్లమెంట్ ఎన్నికలు ఒకే టైం కావటంతో…రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. న్యూ ఇయర్ వేడుకలు జరిగే డిసెంబర్, జనవరి నెలల కన్నా… మార్చిలో రెండు రెట్లు అధికంగా బీర్ల అమ్మకాలు జరిగాయి.

ఎండాకాలం మొదలునుంచే బీర్ల అమ్మకాలు పెరగటం కామన్. అయితే ఈ సారి సమ్మర్ కు తోడు… ఐపీఎల్ మ్యాచ్ లు ఉండటంతో బీర్ల కొనుగోళ్లు ఆమాంతం పెరిగాయి.  వీటికి  లోక్ సభ ఎన్నికలు కూడా కలిసి రావటంతో…బీర్ల అమ్మకాలకు రెక్కలొచ్చాయి. వైన్ షాప్స్ తో అమ్మకాలు ఫుల్ స్వింగ్ లో ఉంటే…. బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బుల్లో సాయంత్రమైతే….ప్లేస్ దొరకటం కష్టంగా మారింది. మార్చి నెలలో  17 వందల కోట్ల వరకు బీర్లు అమ్ముడు పోయినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

జనవరిలో 33 లక్షల 92 వేల బీర్ల కేసులు అమ్ముడు పోతే…. ఫిబ్రవరిలో 36 లక్షల 30 వేల బీర్లు కేసులు అమ్మడయ్యాయి. అయితే మార్చిలో  52 లక్షల 61 వేల కేసులు సేల్ అయినట్లు తెలిపారు అధికారులు. ఈ నెల….వచ్చే నెల మరింతగా బీర్లకు డిమాండ్ ఉండే అవకాశం ఉంది. వీటికి తోడు…పరిషత్ ఎన్నికలు ఉండటంతో సేల్ మరింతగా పెరిగే చాన్స్ ఉందంటున్నారు అధికారులు.