
బీరు సీసాలతో వెళ్తున్న బోలోరో వాహనం టైరు పంచరై అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న 200 కేసుల బీర్లు నేల పాలయ్యాయి. సమాచారం కొన్ని నిమిషాల్లోనే ఆ ఏరియా స్ప్రెడ్ కావడంతో మద్యం ప్రియులు హుటాహుటీన అక్కడికి చేరుకుని అందిన కాడికి బీరు సీసాలు ఎత్తుకెళ్లారు. రోడ్డుపై కొన్ని బీర్లు పగిలిపోగా, మిగిలిన వాటికోసం చాలామంది పోటీపడ్డారు.
2023 జూన్ 05 సోమవారం మధ్యాహ్నం టాటా ఏస్ వాహనం అనకాపల్లి నుంచి నర్సీపట్నానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అందులో ఉన్న 200 కేసుల బీర్లు నేల పాలయ్యాయి. అటువైపుకి వెళ్తున్న జనం కూడా బీర్లు కోసం పెద్ద ఎత్తున ఎగబడ్డారు.
Also Read : జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్: కడప విద్యార్ధిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
బీరు సీసాలు పట్టుకెళ్లొద్దని డ్రైవర్ ఎంత బ్రతిమిలాడిన జనాలు పట్టించుకోలేదు. అతని మాట వినకుండా అందిన కాడికి పట్టుకొని ఉడాయించారు. దీంతో అక్కడ చాలా సేపు ట్రాఫిక్ స్థంభించిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారిస్తున్నారు.