మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది: బీర్ల ఐలయ్య

మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది: బీర్ల ఐలయ్య

బీసీలకు కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేసిందని ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల ఐలయ్య అన్నారు.  మంత్రి వర్గంలో తనకు చోటు కల్పిస్తామని హైకమండ్ హామీ ఇచ్చిందని చెప్పారు. ఎన్నికల్లో గొల్లకురుమలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న  వర్గం గొల్లకురుమలని.. వారి ప్రతినిధిగా ఉన్న తనకు మంత్రి వర్గంలో హైకమండ్ అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నాని ఆయన చెప్పారు. మరోవైపు, మూడు రోజులుగా కొనసాగతున్న సస్పెన్స్ కు కాంగ్రెస్ అధిష్టానం తెరదించుతూ.. అందరూ ఊహించినట్లుగానే రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించింది. ఎమ్యెల్యేలందరూ రేవంత్ రెడ్డిని..  సీఎల్పీ నేతగా..సీఎంగా ఎన్నుకున్నారని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. డిసెంబర్ 7వ తేదీ గురువారం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.