టీ20 వరల్డ్ కప్ ముందు టీమిండియాకు తీరిక లేని షెడ్యూల్‌

టీ20 వరల్డ్ కప్ ముందు టీమిండియాకు తీరిక లేని షెడ్యూల్‌

టీ20 వరల్డ్ కప్ కంటే ముందు టీమిండియా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో  సిరీస్లు ఆడనుంది. జింబాబ్వే టూర్ తర్వాత భారత్తో టీ20, వన్డే సిరీస్ లు ఆడేందుకు ఆసీస్, సౌతాఫ్రికా జట్లు ఇక్కడకు రానున్నాయి. అయితే ఈ సిరీస్లకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది. 

టీమిండియాతో టీ20 సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా భారత్ రానుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానంది. మూడు మ్యాచుల టీ20 సిరీస్లో భాగంగా ఫస్ట్ టీ20 సెప్టెంబర్‌ 20న మొహాలీలో జరగనుంది. రెండో టీ20 సెప్టెంబర్‌ 23న గౌహతిలో ఆడనుంది. చివరిదైన మూడో టీ20 సెప్టెంబర్‌ 23న హైదరాబాద్లో జరగనుంది. 

ఆసీస్తో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత భారత్..సౌతాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్ ఆడనుంది. భారత పర్యటనలో భాగంగా  దక్షిణాఫ్రికా  మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో పాల్గొననుంది.  సెప్టెంబర్‌ 28-న తిరువనంతపురంలో తొలి టీ20 జరగనుంది. అక్టోబర్‌ 2న గౌహతిలో రెండో మ్యాచ్ నిర్వహిస్తారు. అక్టోబర్‌ 4న ఇండోర్‌లో మూడో మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ భారత్ ఆడనుంది. లక్నోలో అక్టోబర్‌ 6న- తొలి వన్డే, రాంచీలో అక్టోబర్‌ 9న - రెండో వన్డే జరగనుంది. చివరి వన్డే ఆక్టోబర్ 11న ఢిల్లీలో ఆడనుంది.