తెలంగాణ మినహా 3 రాష్ట్రాల్లో వడ్ల సేకరణ ప్రారంభం

తెలంగాణ మినహా 3 రాష్ట్రాల్లో  వడ్ల సేకరణ  ప్రారంభం
  • తెలంగాణ మినహా.. ఇయ్యాల్టి నుంచి 3 రాష్ట్రాల్లో ప్రారంభం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: తెలంగాణ మినహా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో యాసంగి సీజన్ వడ్ల సేకరణ శుక్రవారం నుంచి మొదలుకానుంది. పొరుగు రాష్ట్రాల్లో వడ్లు కొనుడు షురూ అవుతుంటే మన రాష్ట్రంలో మాత్రం ఇప్పటి వరకు నిర్ణయమే తీసుకోలేదు. దీంతో రాష్ట్ర రైతులు పరేషాన్​లో ఉన్నరు. గురువారం రాష్ట్రాలవారీగా యాసంగి ధాన్యం సేకరణపై కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ , వినియోగదారుల మంత్రిత్వశాఖ ఉత్వర్వులిచ్చింది. దీంతో ఏపీ, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో ఏప్రిల్1 నుంచి వడ్లు సేకరించాలని నిర్ణయించారు. ఏపీలో ఆగస్టు 30 నాటికి , కేరళలో జులై 15 నాటికి, కర్నాటకలో  మే 31 నాటికి సేకరణ పూర్తిచేయాలని కేంద్రం ఆదేశించింది. ఒడిశా, బెంగాల్​లో మే నెల ప్రారంభం నుంచి జూన్‌‌‌‌ 30 నాటికి  పూర్తిచేయాలని, అసోంలో జులై 1, త్రిపురలో జూన్1 నుంచి వడ్ల సేకరణ షురూ చేసి  సెప్టెంబరు 30 నాటికి పూర్తిచేయాలని టార్గెట్ పెట్టింది. కాగా ఈ 7 రాష్ట్రాల్లో కస్టమ్ మిల్లింగ్ రైస్‌‌‌‌ సెప్టెంబరు నెల 30 నాటికి పూర్తిచేసి ఎఫ్‌‌‌‌సీఐకి బియ్యం సరఫరా చేయాలని కేంద్రం ఆదేశించింది.