
పద్మారావునగర్, వెలుగు: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో అభివృద్ది చేసిన బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తారని రైల్వే అధికారులు వెల్లడించారు. రైల్వే చీఫ్ పీఆర్ఓ ఎ.శ్రీధర్ సోమవారం బేగంపేట స్టేషన్లో వివరాలు వెల్లడించారు. రూ.26.55 కోట్లతో బేగంపేట, రూ.25.85 కోట్లతో కరీంనగర్ , రూ.25.41 కోట్లతో వరంగల్ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేశామన్నారు. సుమారు రూ.12 కోట్లతో రెండో ఎంట్రీ గేట్అభివృద్ధి చేయడానికి ప్లాన్చేస్తున్నామన్నారు.