
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘భైరవం’.విజయ్ కనకమేడల దర్శకత్వంలో కెకె రాధామోహన్ నిర్మించారు. మే 30న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే పవర్‌ఫుల్ పోస్టర్లు, టీజర్, మూడు పాటలతో అంచనాలు పెంచిన మేకర్స్.. ఆదివారం మే 19న ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
కృష్ణుడు గీతలో చెప్పిన వాక్యంతో ప్రారంభమైన ట్రైలర్ యాక్షన్ ప్యాక్డ్‌గా ఉంటూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. గ్రామస్తులు పవిత్రంగా భావించే వారాహి ఆలయ భూములను మంత్రి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు.
ముగ్గురు స్నేహితులు కలిసి ఆలయాన్ని, దాని వారసత్వాన్ని రక్షించేందుకు బలంగా నిలబడతారు. సాయి శ్రీనివాస్, మనోజ్, నారా రోహిత్‌లు కంప్లీట్ యాక్షన్ లుక్‌లో కనిపిస్తూ ఇంప్రెస్ చేశారు.
‘ఈ భూమి మీద ధర్మాన్ని కాపాడటం కోసం దేవుడే ఏదో ఒక రూపంలో వస్తాడు ’అని జయసుధ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లైలు హీరోయిన్లుగా కనిపించగా, వీరితో పాటు డైరెక్టర్ సందీప్ రాజ్, అజయ్, రాజా రవీంద్ర, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. శ్రీ చరణ్ పాకాల అందించిన మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.