
సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. కారు అద్దం పగులగొట్టి 50వేల నగదు, 11 ఖరీదైన మద్యం సీసాలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఒక్కో మద్యం బాటిల్ విలువ రూ. 28వేల ఉంటుందని తెలిపారు.
జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలో బెల్లంకొండ సురేష్ అలియాస్ సురేంద్ర చౌదరికి సాయిగణేష్ ప్రొడక్షన్స్ పేరుతో ఓ కార్యాలయం ఉంది. అయితే గురువారం(జూన్ 08) సురేష్ కారును కార్యాలయం ముందు పార్క్ చేశాడు. శుక్రవారం(జూన్ 09) ఉదయం ఆ కారును గమనించగా.... కారు ఎడమవైపు అద్దం పగిలి ఉంది. దీంతో కారు డోరు తెరిచి చూసేసరికి అందులో ఉన్న నగదు, మద్యం సీసాలు కనిపించకుండా పోయాయి. దీంతో బెల్లంకొండ సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.