రాష్ట్ర ఉత్తమ డాగ్‌ ‘సింబా’

రాష్ట్ర ఉత్తమ డాగ్‌ ‘సింబా’

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని ఏఆర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్​కు చెందిన డాగ్ స్క్వాడ్‌లో పనిచేసే ‘సింబా’ అనే డాగ్ రాష్ట్ర ఉత్తమ పోలీస్ డాగ్‌గా ఎంపికైంది. ఇటీవల వరంగల్‌ పోలీస్ కమిషనరేట్​లో జరిగిన రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్‌లో సింబా పాల్గొంది. డ్రగ్స్​ను గుర్తించడంలో అత్యుత్తమ ప్రతిభ చూపి ఉత్తమ డాగ్‌గా నిలిచింది. డీజీపీ జితేందర్, మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి చేతుల  మీదుగా గోల్డ్ మెడల్​అందుకుంది. 

కాగా సింబా ఇప్పటివరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన దాదాపు 100 కార్డన్ సెర్చ్ ఆపరేషన్లలో పాల్గొంది. గతేడాది జార్ఖండ్‌లో జరిగిన ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొని 5వ స్థానం సాధించింది. సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆ గోల్డ్​మెడల్​ను డాగ్ స్క్వాడ్‌కు చెందిన కానిస్టేబుల్, సింబా పర్యవేక్షకుడు వేణుకు అందజేశారు.  కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.