Telangana Special : బెల్లంపల్లి జన్సాపూర్ ఊరు ఊరంతా నలభీములే.. గరిట పట్టారంటే ఘుమఘుమలే..

Telangana Special : బెల్లంపల్లి జన్సాపూర్ ఊరు ఊరంతా నలభీములే.. గరిట పట్టారంటే ఘుమఘుమలే..

బెల్లంపల్లి చుట్టుపక్కల జన్కాపూర్ 'వంట మాస్టర్ల' చేతి వంట తినని వాళ్లే ఉండరు. ఆ ప్రాంతంలో ఏ శుభకార్యం జరిగినా వాళ్లే గరిట తిప్పాలి. వాళ్లు వండిన బాగారన్నం మటన్తో తింటే మజానే వేరు. సాధారణంగా ఊళ్లలో ఒక్కరో ఇద్దరో వంటమాస్టర్లు ఉంటారు. కానీ, జన్కాపూర్లో సుమారు ఎనభై మంది ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. ఆ నలభీముల గ్రామంపై ప్రత్యేక కథనం..

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జన్కాపూర్... నలభై ఏళ్ల క్రితం ఈ ఊరికి చెందిన మంచర్ల సీతారాం శుభకార్యా లోవంటలు చేసేవాడు. ఆయన కమ్మగా పండుతాడు అని పేరుండేది. అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆయన్ను తీసుకెళ్లి వంటలు చేయించుకునేవాళ్లు. అలా వెళ్లేటప్పుడు ఆయన తనవెంట కుటుంబ సభ్యులతో పాటు మరికొం దరిని సహాయంగా తీసుకెళ్లేవాడు. అలా వెళ్ళిన వాళ్లలో చాలామంది వంట చేయడం నేర్చుకున్నారు. పదిహేనేళ్ల క్రితం సీతారాం చనిపోయాడు. దాంతో ఆయన కొడుకు అశోక్ కూడా తండ్రి చూపిన మార్గాన్నే ఎంచుకున్నారు.

అశోక్ కు కూడా వంట మాస్టర్గా మంచిపేరుంది. అతడికి ఇతర జిల్లాల నుంచి కూడా ఆర్డర్లు వస్తుంటాయి. అలా వెళ్ళి నప్పుడు అతడితోపాటు కొంతమందిని సహాయంగా తీసుకెళ్తాడు. వాళ్లలో కూడా చాలామందికి వంట నేర్చించి మాస్టర్లుగా తయారు చేశాడు. ప్రస్తుతం అశోక్ తో పాటు సుమారు ఇరవై మంది వంట మాస్టర్లు పని చేస్తున్నారు. ఆ ఊళ్లో మొత్తం ఎనభై మంది వరకు వంట పనులు చేస్తుంటారు. వాళ్లకు సహాయంగా మరికొంత మంది కూడా వెళ్తుంటారు. కూలీ పనుల కంటే వంట పనులకు వెళ్తేనే గిట్టుబాటు అవుతుంది. అంటున్నారు వాళ్లంతా. వీళ్లు వంట చేస్తే ఒక్కో శుభకార్యానికి మూడు వేల రూపాయల నుంచి పదివేల వరకు చార్జ్ చేస్తారు.

వంట చేయడమే పని

బెల్లంపల్లి నియోజకవర్గంలోనే కాదు. చుట్టు పక్కల జిల్లాల్లో కూడా జన్మాపూర్ వంటలు చాలా ఫేమస్. వాళ్లు బెల్లంప బి, మందమర్రి, మంచిర్యాల, కరీంనగర్, గోదావరిఖని, రామగుండం, హైదరా బాద్, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోశు భకార్యాల్లో అర్ధరపై వంటలు చేస్తారు. జన్కాపూర్ మాస్టర్లు చేసే వంటల్లో మటన్, బగారా అన్నంతో పాటు చేప పచ్చడి, మటన్ పచ్చడి చాలా ఫేమస్. ఇక శాకాహారం వండడంలోనూ వీళ్లది. అందెవేసిన చెయ్యి. అంతేకాదు జన్కా పూర్వం మాస్టర్లు తయారు చేసే పచ్చళ్లు అమెరికా తెలుగు వాళ్లు కూడా చాలామంది ఇష్టపడతారు. అందుకే బెల్లంపల్లి చుట్టు పక్కల ప్రాంతాల వాళ్లు ఈ పచ్చళ్లను కొని అమెరికాలోని వాళ్ల చుట్టాలకు పంపుతుంటారు.