Australia cricket: ఆస్ట్రేలియా క్రికెట్‌లో విషాదం.. బంతి తగిలి 17 ఏళ్ళ క్రికెటర్ మరణం

Australia cricket: ఆస్ట్రేలియా క్రికెట్‌లో విషాదం.. బంతి తగిలి 17 ఏళ్ళ క్రికెటర్ మరణం

ఆస్ట్రేలియా క్రికెట్ లో విషాదం చోటు చేసుకుంది. 17 ఏళ్ల ఆస్ట్రేలియా క్రికెటర్ బెన్ ఆస్టిన్ బంతి తగిలి మరణించాడు. మంగళవారం(అక్టోబర్ 28) మెల్‌బోర్న్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా బంతి తగిలి ప్రాణం కోల్పోయాడు. విక్టోరియా క్రికెట్ హెడ్ నిక్ కమ్మిన్స్ ఈ విషాద వార్తను ధృవీకరించారు. ప్రస్తుతం ఈ విషయం ఆస్ట్రేలియా క్రికెట్ ను తీవ్రంగా కలచి వేస్తుంది. ఆస్టిన్ హెల్మెట్ ధరించి నెట్స్‌లో డెలివరీలను ఆడుతూ ఉండగా మెడ దగ్గర అతనికి బంతి తగిలి గాయమైంది. బంతి బలంగా తగలడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే పారామెడిక్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

17 ఏళ్ల ఈ క్రికెటర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మోనాష్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా అతను ప్రాణాలతో పోరాడి బుధవారం (అక్టోబర్ 29) ప్రాణాలు విడిచాడు. 2014లో పిల్ హ్యూజ్ బౌన్సర్ ధాటికి మరణించిన తర్వాత మరోసారి ఇలాంటి విషాదం జరగడం విచారకరం. ఆస్టిన్ మరణం ఫిల్ హ్యూస్ విషాద చేదు జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. బెన్ మరణించడంతో అతని కుటుంబం ఎంతలా కుంగిపోయిందో అతని తండ్రి జేస్ ఆస్టిన్ మాట్లాడారు. 

ఆ టీనేజర్ టోర్నమెంట్‌లో ఫెర్న్‌ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హెల్మెట్ ధరించినప్పటికీ అతనికి గాయం అయింది. "గురువారం తెల్లవారుజామున మరణించిన మా బెన్ మరణంతో మేము పూర్తిగా కుంగిపోయాము. అతను మా జీవితాల్లో ఒక ప్రకాశవంతమైన వెలుగు. ఈ విషాద వార్తతో బెన్ మా నుంచి దూరమయ్యాడు. బెన్ క్రికెట్‌ను చాలా ఆరాధిస్తాడు. అతని జీవితంలో క్రికెట్ ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది". అని జేస్ ఆస్టిన్ క్రికెట్ విక్టోరియా ద్వారా ఒక ప్రకటనలో తెలిపారు.