మరోసారి రికార్డు .. లైఫ్​టైం హైలకు సూచీలు

మరోసారి రికార్డు .. లైఫ్​టైం హైలకు సూచీలు
  • 77 వేల ఎగువన సెన్సెక్స్​
  • 92 పాయింట్లు పెరిగిన నిఫ్టీ​

 ముంబై: బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ సెన్సెక్స్ మొదటిసారిగా మంగళవారం 77,000 స్థాయికి ఎగువన ముగిసింది.  ఇండెక్స్ మేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇన్ఫోసిస్​, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలలో ర్యాలీతో కీలకమైన ఈక్విటీ సూచీలు ఆల్​టైం హైకి చేరుకున్నాయి. నిఫ్టీ తాజా గరిష్టస్థాయికి చేరుకుంది.   గ్లోబల్ ఈక్విటీలలో బలమైన ధోరణి మధ్య విదేశీ ఫండ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లోలు బాగా రావడం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచింది.  రేంజ్-బౌండ్ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్,  యుటిలిటీ స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు డిమాండ్ కనిపించింది.

మూడో వరుస సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 30 షేర్ల బీఎస్​ఈ సెన్సెక్స్ 308.37 పాయింట్లు పెరిగి 77,301.14 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 374 పాయింట్లు పెరిగి తాజా జీవితకాల గరిష్ట స్థాయి 77,366.77ను తాకింది.    ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 92.30 పాయింట్లు పెరిగి  రికార్డు ముగింపు గరిష్ట స్థాయి 23,557.90ని తాకింది. డే ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 113.45 పాయింట్లు పుంజుకుని 23,579.05 వద్ద సరికొత్త ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైమ్ హైని తాకింది.  సెన్సెక్స్ కంపెనీల్లో పవర్ గ్రిడ్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, జేఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూ స్టీల్, ఎస్​బీఐ అత్యధికంగా లాభపడ్డాయి. అయితే, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఐటీసీ  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వెనుకబడి ఉన్నాయి.  బీఎస్​ఈ స్మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ గేజ్ 0.96 శాతం, మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.43 శాతం పెరిగింది. 

చాలా సూచీలు లాభాల్లోనే..

 సూచీలలో రియాల్టీ 2.11 శాతం, యుటిలిటీస్ 1.05 శాతం, టెలికమ్యూనికేషన్ 1 శాతం, వినియోగదారుల విచక్షణ 0.90 శాతం, బ్యాంకెక్స్ 0.83 శాతం, సేవలు 0.74 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.73 శాతం పెరిగాయి.   మరోవైపు, ఆటో, మెటల్  ఆయిల్ అండ్​ గ్యాస్ వెనుకబడి ఉన్నాయి.   ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో  షాంఘై సానుకూలంగా స్థిరపడగా, హాంకాంగ్ నష్టాల్లో ముగిసింది.  

మిడ్ సెషన్ డీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. సోమవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.  ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐలు శుక్రవారం రూ. 2,175.86 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు.   గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 0.27 శాతం క్షీణించి 84.02 డాలర్లకు చేరుకుంది.  బక్రీద్​ సందర్భంగా సోమవారం ఈక్విటీ మార్కెట్లు పనిచేయలేదు.

భారత మార్కెట్ ఎన్నికల తరువాత సాధించిన లాభాలను క్రమంగా పెంచుకుంటోంది.   రాబోయే బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సానుకూలంగా స్పందిస్తోంది. ఇది వృద్ధి,  ప్రజాదరణ మధ్య సమతుల్యతను సాధించగలదని అంచనా. గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్​బాగున్నాయి.  ఈ నెలలో మార్కెట్ అస్థిరత తగ్గింది. దీనివల్ల మేలు జరుగుతుంది’’  

వినోద్ నాయర్,  జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్​ హెడ్​​