
జహీరాబాద్, వెలుగు: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల తాళాలు ఇవ్వాలని శనివారం జహీరాబాద్ పట్టణ సమీపంలోని హోతికే శివారులో లబ్ధిదారులు ఇండ్ల ముందు బైఠాయించి ధర్నా చేశారు. సర్టిఫికెట్లు జారీ చేసి ఏడాది దాటుతున్నా ఇండ్లను అప్పగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం నాయకుడు మహిపాల్ మాట్లాడుతూ..ఇప్పటికే రెండుసార్లు అధికారులు లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇలా తాళాలు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. శనివారం ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా తాళాల అప్పగిస్తామని చెప్పి మళ్లీ వాయిదా వేయడం ఏంటని ప్రశ్నించారు.
ఎస్ఐ కాశీనాథ్ లబ్ధిదారులతో మాట్లాడి వారిని సముదాయించారు. వారం రోజుల్లోగా ఇండ్లను అప్పగించకపోతే తాళాలు పగలగొట్టి ఇండ్లన స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయం నుంచి జహీరాబాద్లోని ఆర్డీవో ఆఫీస్వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.