బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యేది.. హత్యా? ఆత్మహత్యా?

బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యేది.. హత్యా? ఆత్మహత్యా?

షాపు సీలింగ్‌‌కు ఉరి వేసుకుని కనిపించిన దేబేంద్రనాథ్ రాయ్
కోల్ కతా: బెంగాల్ ఎమ్మెల్యే అనుమానాస్పదంగా చనిపోవడం దుమారం రేపింది. తన ఇంటికి దగ్గర్లోని ఓ షాపు వద్ద ఉరి వేసుకుని చనిపోవడం కలకలం రేపుతోంది. ఇది హత్యే అని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రూలింగ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే ఎమ్మెల్యే మరణానికి కారణమని చెబుతున్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో నార్త్ దినాజ్పూర్ జిల్లా హెంతాబాద్(రిజర్వ్డ్) సీటు నుంచి దేబేంద్రనాథ్ రాయ్(60) సీపీఎం టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. తన ఎమ్మెల్యే సభ్యత్వానికి మాత్రం ఆయన రాజీనామా చేయలేదు.

రాజకీయ దుమారం
సోమవారం హెంతాబాద్ ఏరియా బిందాల్ గ్రామంలోని తన ఇంటికి దగ్గర్లోని ఓ షాపు సీలింగ్కు రాయ్ఉరి వేసుకుని కనిపించారు. ఇది ఆత్మహత్యేనని, డెడ్బాడీ నుంచి ఓ సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని, తన మరణానికి ఇద్దరు వ్యక్తులు కారణమని రాయ్ అందులో రాశారని పోలీసులు తెలిపారు. ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైందని, ఫోరెన్సిక్ టీమ్ ఆధారాలు సేకరించిందని, డెడ్బాడీని పోస్ట్మార్టం కోసం పంపించామని చెప్పారు. రాయ్ కుటుంబ సభ్యులు మాత్రం.. ఇది ముమ్మాటికీ హత్యేనని, సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. రాయ్ని టీఎంసీ గూండాలే చంపేశారని, మంగళవారం 12 గంటల పాటు జిల్లా బంద్ పాటించాలని బీజేపీ పిలుపునిచ్చింది. సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో బెంగాల్లో గూండా రాజ్యం నడుస్తోందన్నారు.

For More News..

ఆ మ్యాచులో ప్రాణం పెట్టి ఆడాం

రాజస్థాన్‌‌లో గెహ్లాట్, పైలట్‌‌.. నువ్వా? నేనా?

లాక్డౌన్ పూర్తిగా ఎత్తేద్దాం: కేంద్రం.. మళ్లీ పెడదాం : రాష్ట్రాలు