ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టడమే మోదీ గ్యారంటీ : మమత

ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టడమే మోదీ గ్యారంటీ :  మమత

కోల్‌కతా: జూన్ 4 తర్వాత అవినీతి నేతలపై కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పడమంటే.. ప్రతిపక్ష నేతలను జైల్లో పెడతారనే అర్థమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. సోమవారం ఆమె బంకురా వద్ద నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడారు. "ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ బెంగాల్‌కు వస్తున్నారు. ఈ విషయంలో ఎటువంటి సమస్య లేదు. 

కానీ.. లోక్ సభ ఎన్నికల తర్వాత అవినీతి విషయంలో ప్రతిపక్షాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెబుతున్న తీరు సరైంది కాదు. ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడతారా? ఎన్నికల తర్వాత బీజేపీ నేతలను జైల్లో పెడతానని నేను చెబితే ఎలా ఉంటుంది? ప్రజాస్వామ్యంలో ఇది అస్సలు కరెక్ట్ కాదు.  జూన్ 4 తర్వాత ప్రతిపక్ష నేతలందరినీ జైల్లో పెట్టడమే మోదీ గ్యారంటీ" అని మమత విమర్శించారు.