టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంపై స్పందించిన మమత

టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంపై స్పందించిన మమత
  • బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ

కోల్​కతా: టీచర్ రిక్రూట్​మెంట్ స్కాంలో నేరం రుజువైతే పార్థ ఛటర్జీకి జీవిత ఖైదు విధించినా అభ్యంతరంలేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కామెంట్ చేశారు. మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టయిన తృణమూల్ కాంగ్రెస్ మంత్రి పార్థ ఛటర్జీ విషయంలో ఆమె సోమవారం తొలిసారి మాట్లాడారు. ఈ కేసును వీలైనంత త్వరగా తేల్చాలని కోరారు. ఎవరు తప్పు చేసినా తాను సహించబోనని, అవినీతికి మద్దతు ఇవ్వబోనని చెప్పారు. 

మమతకు ఛటర్జీ మూడు సార్లు ఫోన్ !

మనీల్యాండరింగ్​ కేసులో అరెస్టైన పార్థ ఛటర్జీ సీఎం మమతతో మాట్లాడేందుకు ప్రయత్నించారని ఈడీ అధికారులు చెప్పారు. అరెస్టు తర్వాత మూడుసార్లు సీఎంకు ఫోన్​ చేశారని తెలిపారు. అయితే, సీఎం మమతా బెనర్జీ ఫోన్​లో అందుబాటులోకి రాలేదని అధికారులు వివరించారు.