
కోల్‌కతా: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఏ పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా చేయబోనని పీకే తెలిపారు. బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ 200 సీట్ల పైచిలుకు ఆధిక్యంతో దూసుకెళ్తున్న తరుణంలో ఆ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన పీకే ఈ నిర్ణయం తీసుకోవడం షాక్‌కు గురి చేస్తోంది. ‘నేను ఎన్నికల స్ట్రాటజిస్ట్‌గా కొనసాగాలని అనుకోవడం లేదు. ఇప్పటివరకు చేసింది చాలనిపిస్తోంది. కొంత విరామం తీసుకొని జీవితంలో మరేదైనా చేయాలని అనుకుంటున్నా. దీని నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నా’ అని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. తాను రాజకీయ నాయకుడిగా ఫెయిల్ అయ్యానని, కాబట్టి అటు వైపు వెళ్లే ఆలోచనలు ఉన్నాయని చెప్పారు. కాగా, బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ 100 సీట్ల మార్కును చేరుకుంటే పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా తాను తప్పుకుంటానని ఎన్నికల ప్రచార సమయంలో పీకే సవాల్ చేశారు. అయితే ఎలక్షన్ రిజల్ట్స్‌లో బీజేపీ 80 సీట్ల మార్కుకు దగ్గరలో ఆధిక్యంలో ఉంది. అయినా పీకే మాత్రం ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకోవడం గమనార్హం.