రూపాయికే వైద్యం అందించిన సుశోవన్ కన్నుమూత

రూపాయికే వైద్యం అందించిన సుశోవన్ కన్నుమూత

పశ్చిమబెంగాల్ లో దాదాపు 60 ఏళ్ల పాటు కేవలం ఒక్కరూపాయికే  ఎందరో రోగులకు  చికిత్స అందించిన  డాక్టర్ సుశోవన్ బందోపాధ్యాయ్(84) కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న ఆయన కోల్ కతాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు.  సుశోవన్ బెనర్జీ చేసిన కృషికి భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డు అందించింది. 1984లో  బోల్పోర్ నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత పార్టీని వీడి ప్రజలకు వైద్యం అందించారు.

సుశోవన్  మృతి పట్ల ప్రధాని, మోడీ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. పెద్ద మనసున్న వ్యక్తిగా డా.సుశోవన్ గుర్తిండిపోతారని మోడీ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని సానుభూతి తెలిపారు.  ఆయన మరణం విచారకరమని మమతా బెనర్జీ అన్నారు.