
Bengaluru News: ప్రస్తుతం పెద్దపెద్ద నగరాల్లో అపార్ట్మెంట్ కల్చర్ విస్తరించింది. పైగా భూమి ఖరీదైనదిగా మారిపోవటంతో గాల్లోనే నివాసాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ కోట్లు ఖర్చు చేసి కొనుక్కునే అపార్ట్మెంట్లలో అక్కడి అసోసియేషన్స్ పెట్టే వింత రూల్స్ చూస్తుంటే ఆశ్చర్యం కలగకమానదు.
అందరి ఇళ్లలో చెప్పుల స్టాండ్ ఉండటం కామన్. దానిని సహజంగా అందరూ తమ గుమ్మానికి బయటే పెట్టుకుంటుంటారు. భారతీయ వాస్తును ఫాలో అయ్యేవారు చెప్పులు ఇంట్లో పెట్టుకోరు. కానీ బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని ప్రెస్టీజ్ సన్ రైజ్ పార్క్ అపార్ట్మెంట్లో ఆశ్చర్యకమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. వాస్తవానికి వెయ్యికి పైగా కుటుంబాలు నివసిస్తున్న ఈ కాంప్లెక్స్ కొద్దిరోజుల కిందట అపార్ట్మెంట్ వాసులు తమ చెప్పుల స్టాండ్స్, మెుక్కల కుండీలు సహా ఇతర పర్సనల్ వస్తువులను అపార్మెంట్ కారిడార్ల నుంచి వెంటనే తొలగించాలని పేర్కొంది. దీనిపై దాదాపు 50 శాతం మంది సానుకూలంగా స్పందించినప్పటికీ.. మిగిలిన వారికి నచ్చజెప్పటంతో క్రమంగా తీరు మార్చుకున్నారు. అయితే ఒక ఫ్యామిలీ మాత్రం తమ షూర్యాక్ ప్రస్తుతం ఉన్న చోటే కొనసాగిస్తామని రెసిడెంట్స్ అసోసియేషన్ కి తేల్చి చెప్పింది.
Also Read : జ్యోతి మల్హోత్రా దేశ ద్రోహినా
దీంతో రూల్స్ పాటించని వ్యక్తుల నుంచి రోజుకు రూ.100 చొప్పున అసోసియేషన్ జరిమానాను వసూలు చేస్తోంది. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఏకంగా రూ.15వేలు అడ్వాన్స్ పేమెంట్ రూపంలో ఫైన్ చెల్లించి తమను డిస్టబ్ చేయవద్దని చెప్పాడు. పైగా ఇప్పటి గడిచిన 8 నెలల నుంచి అతడు కేవలం ఫైన్ రూపంలో రూ.24వేలు చెప్పించినట్లు తేలింది. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిపోయింది. అయితే సదరు వ్యక్తి అసోసియేషన్ మాట వినకపోవటంతో రోజువారీ ఫైన్ మెుత్తాన్ని డబుల్ చేయాలని వారు నిర్ణయించారు. సదరు యజమాని మాత్రం అడిగినంత ఫైన్ కడుతున్నాడు కానీ తనకు నచ్చినట్లే చెప్పుల స్టాండ్ ఉంటుందని చెప్పి, తమను డిస్టబ్ చేయెుద్దని తేల్చి చెప్పేశాడంట.
అసలు చెప్పుల స్టాండ్స్ తొలగింపు ఎందుకు..?
వాస్తవానికి ఫైల్ సేఫ్టీ రూల్స్ ప్రకారం అపార్ట్మెంట్ కారిడార్లలో, పెద్దపెద్ద బిల్డింగుల్లో ఉండే కారిడార్లలో ఎలాంటి వస్తువులు, అడ్డంకులు ఉండకూడదని రూల్స్ చెబుతున్నాయి. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగిన సందర్భాల్లో ప్రజలను వేగంగా అక్కడి నుంచి ఖాళీ చేయించటానికి ఇది దోహదపడుతుంది. అందుకే అపార్మెంట్ కారిడార్లలో పర్సనల్ వస్తువులు, మెుక్కలు వంటి వస్తువులు లేకుండా చూడాలని అపార్మెంట్ అసోసియేషన్ చెబుతోంది. ఇకపోతే తాజాగా ఆదివారం రోజున హైదరాబాదులో జరిగిన వరుస అగ్నిప్రమాదాల్లో సైతం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ కూడా తగిన ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించలేదని అధికారులు గుర్తించారు.