పోటీ పడే మగాళ్లు ఉన్నారా.. 15 రోజుల్లో.. 3 కోట్ల బీరు బాటిళ్లు తాగారు..

పోటీ పడే మగాళ్లు ఉన్నారా.. 15 రోజుల్లో.. 3 కోట్ల బీరు బాటిళ్లు తాగారు..

తాగటం మొదలు పెడితే.. బాటిళ్లు బాటిళ్లు ఖాళీ కావాలి.. అంతేకానీ ఏదో తాగం అన్నట్లు తాగితే మజా ఏంటీ అంటున్నారు కర్నాటక రాష్ట్ర జనం.. బీరు తాగటంలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశారు.. అవును.. జస్ట్ 15 అంటే 15 రోజుల్లోనే.. అక్షరాల 3 కోట్ల బీరు బాటిళ్లను ఖాళీ చేశారు.. ఏప్రిల్ నెలలో కర్నాటకలో ఎండలు మండిపోయాయి.. దీంతో మందు ప్రియులు.. ఈవినింగ్ అయితే చల్లగా బీరును కడుపులో వేస్తున్నారంట.. బీరు సేల్స్ లో కర్నాటక స్టేట్ ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేయటం విశేషం...

 ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందిస్తూ కర్ణాటకలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా బీర్ల అమ్మకాలు పెరిగాయని గత 15 రోజులుగా, రాష్ట్రంలో 23.5 లక్షల కార్టన్ బాక్స్‌ల బీర్లు అమ్ముడయ్యాయని తెలిపారు.  ఇది నెలలో గత సంవత్సరం అంటే ఏప్రిల్ 2023 మొత్తంలో 38.6 లక్షల బీరు బాక్సులు అమ్ముడయ్యాయని తెలిపారు.

 ఏప్రిల్ నెల ప్రారంభమైన 15 రోజులకే 23.5 లక్షల బాక్సులు అమ్ముడయ్యాయని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. అంటే గత సంవత్సరం లెక్కతో పోలీస్తే 61 శాతం కంప్లీట్ అయ్యిందని తెలిపారు. అయితే, ఇంకొద్ది రోజుల్లోనే ఆ మొత్తం కూడా ఫినిష్ చేసి ఈ సంవత్సరం కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తారేమో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  

ఇంత మొత్తంలో బీర్లు అమ్ముడుపోవడానికి కారణం లోక్ సభ ఎన్నికలు దగ్గరకు రావడం వల్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం కోసం బీర్లు, బిర్యానీలు పంచుతున్నారని ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికి కర్ణాటక ప్రజలు బీర్ల  కొనుగోళులో ఆల్ టైం రికార్ట్ క్రియెట్ చేశారు.