V6 News

ఇలాంటి దోపిడీ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. రాత్రికి రాత్రి బస్ షెల్టర్ మాయం చేసిన దొంగలు.

ఇలాంటి దోపిడీ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. రాత్రికి రాత్రి బస్ షెల్టర్ మాయం చేసిన దొంగలు.

అది రద్దీ రోడ్డు.. నిత్యం వేలాది మంది తిరుగుతుంటారు.. వందలాది బస్సులు వెళుతుంటాయి.. వేలాది బైక్స్, కార్లు తిరుగుతుంటాయి.. అలాంటి రోడ్డులో ప్రయాణికుల కోసం.. ఆర్టీసీ బస్ షెల్టర్ ఏర్పాటు చేసింది. ఐరన్ రాడ్లు, రేకులతో మోడ్రన్ లుక్ లో షెల్టర్ ఏర్పాటు చేయటమే కాకుండా.. ఓ పది కుర్చీలు కూడా పెట్టింది. ఇందు కోసం 10 లక్షల రూపాయలు ఖర్చు చేసింది కూడా ప్రభుత్వం. అలాంటి బస్ షెల్టర్ రాత్రికి రాత్రి మాయం అయ్యింది. ఉదయం ఉన్న బస్ షెల్టర్ తర్వాత రోజు కనిపించలేదు. మరో విశేషం ఏంటో తెలుసా.. ఏకంగా బోల్టులతోపాటు ఏదీ వదలకుండా.. ఎంతో చక్కగా.. ఎత్తుకెళ్లారు దొంగలు.. గతంలో ఎప్పుడూ ఇలాంటి తరహా దొంగతనం భారతదేశ చరిత్రలోనే జరగలేదు అనటంలో సందేహం లేదు.. నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ దోపిడీగా ఉన్న ఈ ఘటన బెంగళూరు మహా నగరంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

  
 బెంగళూరు నగరంలో అసెంబ్లీకి కూత వేటు దూరంలో కన్నింగ్‌హామ్ రోడ్‌లో  వారం క్రితం బస్ షెల్టర్ ను  ఏర్పాటు చేశారు. లింగరాజపురం, హెన్నూరు, బాణసవాడి, పులకేశినగర్, గంగేనహళ్లి, హేబల్, యలహంక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం  ఈ బస్ షెల్టర్ ను రూ.10 లక్షలతో నిర్మించారు.  అయితే  షెల్టర్‌ను ఏర్పాటైన వారం రోజులకే చోరీ చేశారు దొంగలు. 

బెంగుళూరు నగరంలో బస్ షెల్టర్లు నిర్మించేందుకు బస్ షెల్టర్ చోరీపై  బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఓ కంపెనీకి పనులు అప్పగించింది. అయితే బస్ షెల్టర్ చోరీపై కంపెనీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ రవిరెడ్డి సెప్టెంబర్ 30వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ షెల్టర్‌ను ఆగస్టు 21న ఏర్పాటు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ  కంపెనీ ఉద్యోగులు ఆగస్టు 28న ఈ షెల్టర్‌ని చూసేందుకు వెళ్లగా.. ..అక్కడికక్కడేమీ కనిపించలేదు. కన్నింగ్ హామ్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ మొత్తాన్ని దొంగలు ఎత్తుకెళ్లారని  ఫిర్యాదు చేశారు.  పోలీసులు ఐపీసీ సెక్షన్ 279 కింద కేసు నమోదు చేశారు. 

బెంగుళూరులో ఈ ఏడాది మార్చిలోనూ ఓ బస్టాండ్ రాత్రిపూట అదృశ్యమైంది. HRBR లేఅవుట్ దగ్గర గల  మూడు దశాబ్దాల నాటి బస్టాండ్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. అంతకు ముందు 2015లో హారిజన్ స్కూల్ సమీపంలోని దూపనహళ్లి బస్టాప్  రాత్రికి రాత్రే కనిపించకుండా పోయింది. 2014లో రాజరాజేశ్వరినగర్‌లోని బీఈఎంఎల్‌ లేఅవుట్‌ 3వ స్టేజీలో 20 ఏళ్ల నాటి బస్టాప్‌ ను దొంగలు ఎత్తుకెళ్లారు.