ప్లేస్‌మెంట్ ఫీజు పేరుతో విద్యార్థుల జీతాల్లో 2.1% డిమాండ్ చేస్తోన్న కళాశాల

ప్లేస్‌మెంట్ ఫీజు పేరుతో విద్యార్థుల జీతాల్లో 2.1% డిమాండ్ చేస్తోన్న కళాశాల

బెంగుళూరులోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల "ప్లేస్‌మెంట్ సెల్ ఫీజు" ద్వారా విద్యార్థుల జీతాలలో 2.1% డిమాండ్ చేస్తోందని ఆరోపిస్తూ రెడ్డిట్‌లోని ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'బెంగళూరు' రెడ్డిట్ గ్రూప్‌లో పర్పుల్‌రేజ్‌ఎక్స్ చేసిన పోస్ట్ స్క్రీన్‌షాట్‌లు ట్విట్టర్ లాంటి ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత విద్యార్థి ఫీజు చెల్లించాలని కళాశాల కోరిందని, కళాశాల ఇప్పుడు వారి సర్టిఫికేట్‌లను నిలిపివేస్తోందని, దీనివల్ల కంపెనీతో వారు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పోస్ట్ పేర్కొంది.

ఫీజు క్లెయిమ్‌కు మద్దతుగా కళాశాల నుంచి అధికారిక పత్రం లేదా సర్క్యులర్ ఏదీ అందించబడలేదు. "వారు నాకు మాటలతో మాత్రమే చెబుతున్నారు. చెల్లించమని నన్ను బలవంతం చేస్తున్నారు" అని పోస్ట్ పేర్కొంది." నేను ఇంకా సంపాదించలేదు. ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యాను, కానీ నా CTCలో 2.1% చెల్లించాలని వారు కోరుతున్నారు. వేరే కంపెనీల్లో ఉద్యోగంలో చేరిన నా సీనియర్లకు కూడా కాలేజీ ఇలాగే చేసింది" అనిని విద్యార్థి ఆరోపించారు.

అయితే పోస్ట్‌లో కళాశాల పేరును పేర్కొనలేదు. మరొక యూజర్ కూడా తమ అనుభవాన్ని పంచుకున్నారు. దాన్ని కళాశాల 'ప్లేస్‌మెంట్ శిక్షణ రుసుము'గా పేర్కొంటుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.