రోడ్డు మధ్యలో ఆగిన ఆర్టీసీ బస్సు.. స్టీరింగ్ పట్టిన పోలీస్

రోడ్డు మధ్యలో ఆగిన ఆర్టీసీ బస్సు.. స్టీరింగ్ పట్టిన పోలీస్

కాంగ్రెస్​తో కూడిన 24 ప్రతిపక్ష పార్టీల అలయెన్స్​ 'ఇండియా' మీటింగ్​ జులై 18న బెంగళూరులో జరిగింది. అయితే వీవీఐపీల రాకతో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్​ ఏర్పడింది. అప్పుడే ఓ ఏసీపీ చేసిన పని అందరితో శభాష్​ అనిపించుకునేలా చేసింది. వివరాలిలా ఉన్నాయ్.. వీవీఐపీల రాకతో ట్రాఫిక్ జామ్​ ఏర్పడింది. ఇదే సమయంలో రూట్​నంబర్ 330లో బస్సు నడుపుతున్న బీఎంటీసీ బస్సు డ్రైవర్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. 

అప్పటికే చాలా ట్రాఫిక్​ ఉండటంతో బస్సును అతను రోడ్డు పక్కన నిలిపాడు. ఇది గమనించిన ఏసీపీ బి.రామచంద్ర చాకచక్యంగా ఆలోచించారు. అస్వస్థతకు గురైన డ్రైవర్​ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్​ మధ్యలో బస్సు ఆగడంతో దానిని నడిపేందుకు ఆయన రంగంలోకి దిగారు. ఆయనే స్వయంగా కిలోమీటర్ కు పైగా బస్సును నడిపి బస్సు షెల్టర్​ వద్ద సెఫ్​గా పార్క్​ చేశారు. దీంతో ట్రాఫిక్​ క్లియర్​అయింది. 

అత్యవసర సమయాల్లో చాకచక్యంగా వ్యవహరించడమే కాకుండా.. విధుల్లో తన నిబద్ధతను చాటుకున్న ఏసీపీపై సోషల్​ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇలాంటి వారే దేశాభివృద్ధికి దోహదపడతారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.