పోక్సో కేసులో యడియూరప్పకు అరెస్ట్ వారెంట్ 

పోక్సో కేసులో యడియూరప్పకు అరెస్ట్ వారెంట్ 

పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై బెంగళూరు కోర్టు గురువారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డారని 17 ఏళ్ల బాలిక తల్లి 2024 ఫిబ్రవరిలో యడ్యూరప్పపై  ఫిర్యాదు చేసింది.  బాధిత మహిళ ఫిర్యాదుతో యాడ్యూరప్పపై పొక్సో చట్టం, సెక్షన్ 354 A  లైంగిక వేధింపుల కింద కేసు నమోదు అయింది. 

ఈ కేసులో ఇంతకుముందే యడియూరప్పకు ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్ (సీఐడీ) నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని నోటీసులు తెలిపింది. అవసరమైతే యడియూరప్పను అరెస్ట్ చేయొచ్చని కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర అన్నారు. ఈ కేసులో యడ్యూరప్పపై ఫిర్యాదు చేసిన మహిళ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మేలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతిచెందింది.