
బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్, బిలియనీర్ కిరణ్ మజుందార్-షా బెంగళూరు సిటీ పాలనపై తీవ్ర విమర్శలు చేసారు. అలాగే నగర దుస్థితిని గుర్గావ్‌తో పోల్చుతు, కనీస ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించడంలో, పౌర బాధ్యతలను నిర్వహించడంలో నిర్లక్ష్యం చేసినందుకు ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డరు.
ప్రతి ధనిక నగరానికి ఇదే గతి పడుతుంది, బెంగళూరు మరో గుర్గావ్ లాగ తయారవుతుంది. గుర్గావ్ చెత్త సంక్షోభంపై రచయిత & కాలమిస్ట్ సుహెల్ సేథ్ మాటలకి స్పందిస్తూ ప్రాథమిక మౌలిక సదుపాయాలు, పౌర సౌకర్యాలను అందించే బాధ్యత లేకుండా రాష్ట్రం బంగారు బాతును దోచుకుని చంపుతుంది, డబ్బు సంపాదించడానికి భవన నియమాలను ఉల్లంఘిస్తున్నారు అంటూ విమర్శించారు. అలాగే రోడ్లపై పడేసిన చెత్త ఫోటోలను షేర్ చేస్తూ బెంగళూరు పౌర సంస్థ అయిన BBMPని చెత్తను ఎందుకు తొలగించట్లేదని ప్రశ్నించారు.
ఇక్కడ పనిచేసే ట్రాఫిక్ లైట్ల కంటే మనకు మద్యం దుకాణాలే ఎక్కువ. స్కూల్స్ కంటే బార్లు ఎక్కువ. తెలివి లేని నాయకులు ఉంటే స్మార్ట్ సిటీలు ఉండకూడదు అని కాలమిస్ట్ సుహెల్ సేథ్ అన్నారు.
Disgusting sights at garbage dumping Zone near Berlie Street next to cemetery. What’s the matter with @BBMPofficial can’t you fine the garage dumpers n those who don’t compete or clear construction debris? What terrible civic sense. pic.twitter.com/0XnjVsE2tP
— Kiran Mazumdar-Shaw (@kiranshaw) July 25, 2025