దేశంలోనే తొలి 3D పోస్టాఫీసును ప్రారంభించిన కేంద్రమంత్రి

దేశంలోనే తొలి  3D పోస్టాఫీసును ప్రారంభించిన కేంద్రమంత్రి

టెక్నాలజీలో ముందున్న బెంగళూరు .. దేశానికి ఎప్పుడూ ఓ కొత్త విషయాన్ని అందిస్తోందని రైల్వేమంత్రి అశ్విన్ వైష్ణవి తెలిపారు. దేశంలోనే తొలి త్రిడి ప్రింటెడ్ ఫోస్ట్ ఆఫీస్ ను బెంగళూర్ లో రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. త్రిడి టెక్నాలజీతో అల్సూర్ బజార్ పోస్టాఫీస్ ను ఎల్ అండ్ టీ కంపెనీ నిర్మించింది. రూ. 23 లక్షలతో ఈ భవనాన్ని నిర్మించారు.  సొంత సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి.. భవిష్యత్ భారతావానికి స్ఫూర్తినిస్తోందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో గత తొమ్మిదేళ్లలో దేశం టెక్నాలజీలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. అదే స్ఫూర్తితో ఆన్‌సైట్‌లో 3డి ప్రింటెడ్ భవనాన్ని నిర్మించడం గొప్ప ప్రయత్నమని అశ్విని వైష్ణవ్ అన్నారు.