ఎవడీ పనికి మాలినోడు : మహిళల లో దుస్తులు కొట్టేస్తున్నాడు

ఎవడీ పనికి మాలినోడు : మహిళల లో దుస్తులు కొట్టేస్తున్నాడు

బెంగళూరులో  ఒక షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. అది అట్టాంటి ఇట్టాంటి ది కాదండోయ్.. ఏకంగా బెంగళూరులో ఓ వ్యక్తి అపార్ట్ మెంట్ టెర్రర్స్ పైకి ఎక్కి బేవకూఫ్ లాగా ప్రవర్తించాడు. అతడు చేసిన ఈ పాడు పని అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డైంది.  ఇంతకూ అంత నీచంగా ఏం చేశాడనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి...

గతంలో ఏదైనా పాడు పని చేస్తే బుకాయించవచ్చు.. లేదా తప్పించుకోవచ్చు.  కాని ఇప్పుడు అలాంటి అవకాశాలే లేవు. బెంగళూరులోని లగ్గెరె సమీపంలోని విధానసౌధ లేఅవుట్‌లో  ఓ వ్యక్తి అపార్ట్ మెంట్ టెర్రర్ పై ఓ పాడు పని  చేస్తూ ( ఓ చేత్తో జననాంగాలను పట్టుకొని) .. మహిళల ఇన్నర్ వేర్ లను చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. ఆయన చేసిన ఈ పాడు పని అక్కడున్న సీసీ టీవీలో రికార్డైంది.  స్థానికుల సమాచారం మేరకు .. ఆ గుర్తు తెలియని వ్యక్తి  ఇంటిని అద్దెకు తీసుకున్నాడని.. తరచు టెర్రర్స్ పై కనపడేవాడని తెలిపారు.  అయితే నిందితుడిపై ఇప్పటి వరకు ( వార్త రాసే సమయం వరకు) ఆ అపార్ట్ మెంట్  సమీపంలో రాజ్‌గోపాల్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కానీ, నందిని లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో కానీ  ఎలాంటి కేసు నమోదు కాలేదు.

శృంగారం లేదా హస్త ప్రయోగం అనేది మన దేశంలో బహిరంగంగా చేసుకోరు. నాలుగు గోడల మధ్యనే దాన్ని చేసుకునే సంప్రదాయం మనది. అయితే ఈ మధ్య కొందరు శృంగారం, హస్త ప్రయోగం ఎక్కడంటే అక్కడ చేసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఒక జంట విమానంలో శృంగారం చేసుకుంది. ఇంకొక వ్యక్తి బస్సులోనే హస్త ప్రయోగం చేసుకున్నాడు.  ఇప్పుడు బెంగళూరులోని ఓ అపార్ట్ మెంట్ టెర్రర్స్ పై ఆ పని చేస్తూ సీసీ కెమెరాలకు చిక్కాడు.