పెళ్లి వద్దన్న ప్రియురాలిని కిరాతకంగా హత్య చేసిన ప్రియుడు

పెళ్లి వద్దన్న ప్రియురాలిని కిరాతకంగా హత్య చేసిన ప్రియుడు

కర్ణాటకలోని బెంగళూరులో దారుణం జరిగింది. పెళ్లి వద్దన్న ప్రియురాలిని అతి కిరాతకంగా 15 సార్లు కత్తితో పొడిచి చంపాడు ఓ ప్రియుడు. తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.  నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు జయనగర్ పోలీసులు. 

అసలేం జరిగిందంటే..

బెంగళూరులో  గిరీష్ ఎన్‌ఎల్ అలియాస్ రెహాన్ అహ్మద్(32) ఫరీదా ఖాతూన్ (42)ను  గత కొన్ని రోజులుగా కలిసి ఉంటున్నారు.   ఫరీదా  ఖాతూన్ కు  21, 16 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఖాతూన్ గత నాలుగేళ్లుగా సిటీ స్పాలో పనిచేస్తుంది.  స్పేర్ కార్ డ్రైవర్ అయిన గిరీష్  2022లో దక్షిణ బెంగళూరు వెళ్లినప్పుడు  ఆమెతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మంధ్య  సంబంధం ఏర్పడింది. ఫరీదా  మార్చి 6న తన స్వగ్రామానికి వెళ్లి మార్చి 28న తన కూతురిలో ఒకరితో తిరిగి వచ్చింది. అదే రోజు గిరీష్ బర్త్ డే కావడంతో  ఖాతూన్ తన కుమార్తెతో కలిసి జయనగర్‌లోని ఓయో హోటల్ గదిలో ఉంది.  గిరీష్ కూడా అదే రోజు వారితో కలిసి పార్టీలో  ఉన్నాడు. 

తర్వాత వారిని భోజనం కోసం బయటకు తీసుకెళ్లాడు గిరీష్.  తర్వాత రెండు  పార్కులకు వెళ్లారు.  మధ్యలో గిరీష్ ఓ షాపులు కత్తి కొనుగోలు చేశాడు. ఫరీదాతో కలిసి జయనగర్ వీ బ్లాక్‌లోని షాలినీ గ్రౌండ్ కు వెళ్లాడు. అక్కడ ఫరీదా కు ప్రపోజ్ చేశాడు. అయితే ఆమె పెళ్లికి నిరాకరించడంతో దాడి చేశాడు. తర్వాత తన దగ్గర ఉన్న కత్తితో ఫరీదాను  15 సార్లు పొడిచి పరారయ్యాడు గిరీష్.  

ఈ ఘటనను గమనించిన స్థానిక కొబ్బరి వ్యాపారి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన జయనగర్ పోలీసులు ఫరీదా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే రోజు  రాత్రి 8.30గటంటలకు గిరీష్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. కేసు  నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.