బెంగళూర్: ఐపీఎల్ 19 తుది అంకానికి చేరుకుంది. 2026, మే 31న గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న మహా సంగ్రామంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, గుజరాత్ టైటాన్స్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఐపీఎల్ ఫైనల్ నేపథ్యంలో బెంగళూర్ పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. గతేడాది ఆర్సీబీ విజయోత్సవ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన దృష్ట్యా బెంగళూర్ నగర ప్రజలకు పలు సూచనలు చేశారు.
* ఫలితం వెలువడిన తర్వాత బహిరంగ సంబరాలు నిర్వహించరాదు
* బైక్ ర్యాలీలు, స్టంట్స్, రోడ్లను దిగ్బంధించడం, లేదా మితిమీరిన హారన్ మోతలు చేయొద్దు
* అనుమతి లేకుండా బహిరంగ ప్రత్యక్ష ప్రసారాలు చేయరాదు
* పటాకులు లేదా ప్రమాదకర పదార్థాలు ఉపయోగించరాదు
* బహిరంగ అవాంతరాలు, కొట్లాటలు, రెచ్చగొట్టే సోషల్ మీడియా పోస్టులపై కఠిన చర్యలు.
గత సంవత్సరం ఆర్‌సీబీ సంబరాల సందర్భంగా జరిగిన విషాద తొక్కిసలాట పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ హెచ్చరిక జారీ చేసినట్లు బెంగళూర్ పోలీసులు తెలిపారు.
►ALSO READ | గ్రహాల లెక్కలు తేల్చేసిన జ్యోతిష్యులు.. గట్టేక్కిన ఆర్సీబీ.. ఫైనల్‌లో గిల్ సేనపై ‘శని’ ప్రభావం ఉంది భయ్యా?
