ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నారు కదా.. జీతాలు తగ్గించుకోండి..

ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నారు కదా.. జీతాలు తగ్గించుకోండి..

కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే రోడ్డు రవాణా సంస్థ.. మహిళల కోసం 'శక్తి' పథకాన్ని ప్రారంభించింది.  ఈ పథకం ద్వారా బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. బెంగళూరుతో, ఇతర నగరాల్లోని మధ్యతరగతి, దిగువ-ఆదాయ కుటుంబాలకు చెందిన మహిళలందరూ స్వాగతించే ఈ నిర్ణయంపై చర్చ మొదలైంది. మహిళలు తాము సంపాదించిన దాంట్లో గతంలో ఎక్కువ భాగాన్ని ప్రయాణాలకు ఖర్చు చేసేవారు. ఇప్పుడు వారు ఆ డబ్బును ఆదా చేసుకోవచ్చు, ఇతర ఇంటి ఖర్చులకు ఉపయోగించవచ్చు.

ఈ విషయంపై ఇటీవల, ఒక ట్విట్టర్ యూజర్ మానసి బెంగళూరులోని తన అపార్ట్‌మెంట్‌లోని వ్యక్తులు ఇంట్లో పనిచేయడానికి వచ్చే మహిళల జీతాలు ఎలా తగ్గించాలని చూస్తున్నారో పంచుకున్నారు. దీనికి కారణం ఇప్పుడు వారు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు కదా అని చెబుతున్నారు. ప్రయాణ ఖర్చుల కోసం ఇంతకుముందు వారికి ఎక్కువ జీతాలు చెల్లించేవారు. ఇప్పుడు ఆ డబ్బు చేయనవసరం లేకపోవడంతో.. తాము వారి జీతాలు తగ్గించాలని చూస్తున్నారు.

ఇంట్లో దుర్భరమైన పని చేస్తున్నప్పటికీ భారతదేశంలో గృహ సహాయకులకు చాలా తక్కువ వేతనం లభిస్తుంది. 'శక్తి' పథకం కారణంగా వారు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉన్నందున వారి జీతం తగ్గడం ఖచ్చితంగా వారికి మంచిది కాదు అని ఓ ట్విట్టర్ యూజర్ తన తదుపరి ట్వీట్‌లో జోడించారు.

https://twitter.com/manasip_/status/1669770142048456704