ఆర్సీబీ బిగ్ షాక్.. జస్టిస్ కున్హా రిపోర్టుకు కేబినెట్ ఆమోదం.. కోహ్లీ జట్టుకు చిక్కులు తప్పవా..?

ఆర్సీబీ బిగ్ షాక్.. జస్టిస్ కున్హా రిపోర్టుకు కేబినెట్ ఆమోదం.. కోహ్లీ జట్టుకు చిక్కులు తప్పవా..?

బెంగుళూర్: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు బిగ్ షాక్ తప్పదా..? ఆర్సీబీ మేనేజ్మెంట్‎పై కర్నాటక సర్కార్ చర్యలకు సిద్ధమైందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2025, జూన్ 4న ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా బెంగుళూర్‎లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న కర్నాటక హైకోర్టు జస్టిస్ జాన్ మైఖేల్ డి'కున్హా నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

జస్టిస్ డి'కున్హా ఏక సభ్య కమిషన్ తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. తొక్కిసలాటకు ఆర్సీబీ, కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్, బెంగళూరు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని జస్టిస్ డి'కున్హా కమిషన్ తేల్చింది. తొక్కిసలాట వీరే ప్రత్యక్ష బాధ్యత వహించాలని కమిషన్ నివేదికలో పేర్కొంది. ఈ క్రమంలో బెంగుళూర్ తొక్కిసలాటపై జస్టిస్ డి'కున్హా కమిషన్ ఇచ్చిన నివేదికను కర్నాకట కేబినెట్ ఆమోదించింది.

ALSO READ | IND vs ENG 2025: పంత్ స్థానంలో జురెల్ బ్యాటింగ్..? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?

గురువారం (జూలై 24) సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో కర్నాటక మంత్రి మండలి భేటీ అయ్యింది. ఈ సమావేశంలో జస్టిస్ డి'కున్హా కమిషన్  నివేదికపై చర్చించి ఆమోదం తెలిపింది కేబినెట్. జస్టిస్ డి'కున్హా రిపోర్టుకు మంత్రి మండలి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో నిందితులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయ్యింది. ఆర్సీబీ, కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్, బెంగళూరు పోలీసులపై చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

దీంతో ఆర్సీబీ జట్టుపై కర్నాటక సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై అటు పొలిటికల్ ఇటు క్రీడా వర్గా్ల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, 2025 ఐపీఎల్ విజేతగా ఆర్సీబీ నిలిచిన విషయం తెలిసిందే. 17 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవడంతో.. జూన్ 4వ తేదీన బెంగుళూరులో జట్టు మేనేజ్మెంట్ విక్టరీ పరేడ్, ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ విక్టరీ పరేడ్ కు అభిమానులు ఊహించని స్థాయిలో తరలిరావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోగా.. మరో 50 మంది వరకు గాయపడ్డారు.