World Cup 2023: వరల్డ్ కప్ జట్లకు నెట్ బౌలింగ్ చేస్తున్నస్విగ్గీ డెలివరీ బాయ్..

World Cup 2023: వరల్డ్ కప్ జట్లకు నెట్ బౌలింగ్ చేస్తున్నస్విగ్గీ డెలివరీ బాయ్..

 క్రికెట్ వరల్డ్ కప్ ఫీవర్ మొదలైంది. మరో  రెండు వారాల్లో ప్రపంచకప్ మొదలు కానున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని క్రికెట్ జట్లు ప్రాక్టీసుల్లో మునిగిపోయాయి. వరల్డ్ కప్ వేటలో తలమునకల య్యాయి. ఇందులో భాగంగానే నెదర్లాండ్స్ జట్టు కూడా బెంగళూరులో ప్రాక్టీస్ మొదలు పెట్టింది.. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా.. నెట్ బౌలింగ్ చేసేందుకు స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ కూడా ఎంపిక కావడమే విశేషం.

 బెంగళూరుకు చెందిన స్వీగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ అరుదైన అవకాశాన్ని దక్కించున్నారు. 2023 వన్డే ప్రపంచ కప్ కు ముందు నెదర్లాండ్స్ జట్టుకు నెట్ బౌలర్ గా ఎంపికయ్యాడు. 2023 వన్డే ప్రపంచ కప్లో అన్ని దేశాల జట్లు సిద్ధమవుతున్న సమయంలో నెదర్లాండ్స్ కూడా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. అయితే కొంతమంది స్థానిక నెట్ బౌలర్లకోసం జట్టు ఓ ప్రకటన ఇచ్చింది. నలుగురు నెట్ బౌలర్లను ఎంపిక చేసింది. ఇందులో బెంగళూరుకు చెందిన స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ లోకేష్ కుమార్ కూడా ఎంపికయ్యాడు.. 

వృత్తిరీత్యా స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ గా లోకేష్ పనిచేస్తున్నాడు. నెట్ బౌలర్ గా ఎంపిక కావడం పట్ల లోకేష్ స్పందిస్తూ.. ఇది నా కెరీర్ లో అత్యంత విలువైన క్షణాల్లో ఒకటి.. నేను కనీసం టీఎన్ సీఎ థర్డ్ లీగ్ లో కూడా ఆడలేదు. ఇది నాకు అరుదైన అవకాశం’’ అని లోకేష్ చెప్పుకొచ్చాడు.