ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్: 4 రోజుల్లో 12 వేల కేసులు.. రాంగ్ రూట్‌లో వస్తే అంతే..

ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్: 4 రోజుల్లో 12 వేల కేసులు.. రాంగ్ రూట్‌లో వస్తే అంతే..

బెంగళూరు నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు(BTP)  కఠిన చర్యలు మొదలుపెట్టారు. స్పెషల్  ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ సందర్భంగా  కేవలం నాలుగు రోజుల్లోనే వన్-వేలో బండి నడిపిన 12 వేల 207 మందిపై కేసులు బుక్ చేశారు.

సమాచారం ప్రకారం, తూర్పు డివిజన్‌లో అత్యధికంగా 3,140 కేసులు, తరువాత ఉత్తర డివిజన్ (2,955), దక్షిణ డివిజన్ (2,904),  పశ్చిమ డివిజన్ (2,308) ఉన్నాయి.

గత ఏడాది డేటా ప్రకారం  వన్-వేలో వాహనాలు నడిపేవారి సంఖ్య పెరిగిపోయింది. దీనికి సంబంధించి చాల  వీడియోలు సోషల్ మీడియాలో కూడా వ్యాపించాయి, దింతో పోలీసులు  రంగంలోకి దిగి ఈ చర్య తీసుకున్నారు.  

ఎప్పటికప్పుడు  తప్పకుండా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి, రూల్స్ అమలు చేయకపోతే ఇలాంటి  ఉల్లంఘనలు పెరుగుతూనే ఉంటాయని  పోలీసులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో సిటీలో హెల్మెట్ లేకుండా రైడింగ్ పై  కూడా BTP స్పెషల్  డ్రైవ్‌ నిర్వహించాలని చూస్తోంది.

రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసే వాహనాలను ఎత్తుకెళ్లే (టోయింగ్) విధానాన్ని తిరిగి ప్రారంభిచాలని BTP చూస్తుంది. మూడు డివిజన్లకు ఇప్పటికే టోయింగ్ వాహనాలు అందాయి. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే టోయింగ్ మొదలుపెడతామన్నారు.

ట్రాఫిక్ తగ్గించే మార్గాలపై తూర్పు డివిజన్‌లోని ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో ఉన్న కంపెనీలతో BTP మరో సమావేశం నిర్వహించి తగిన చర్యల అమలుపై చర్చిస్తుందని తెలిపారు.  ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల్లో బెంగళూరు రెండో స్థానంలో ఉంది.